తెలుగుదేశం ప్రభుత్వానికి షాకుల మీద షాకులు ఇస్తున్నాయి.. అటు కేంద్రంలోని బీజేపీ.. ఇటు రాష్ట్రంలోని వైసీపీ. నలుగురు రాజ్యసభ సభ్యులను తీసుకుని… టీడీపీపీ విలీనం అంటూ… ఢిల్లీలో.. ఓ కార్యక్రమాన్ని పూర్తి చేసి.. చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. అది అలా ఉండగానే… ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం.. ప్రజావేదికను.. వైసీపీ సర్కార్ స్వాధీనం చేసుకుంది. అక్కడ.. ఉన్న తెలుగుదేశం పార్టీ సరంజామాను మొత్తం.. తీసుకెళ్లాలని.. సీఆర్డీఏ అధికారులు.. టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. ప్రజావేదికలో.. ఇరవై నాలుగో తేదీన కలెక్టర్ల మీటింగ్ పెట్టాలని కూడా నిర్ణయించారు.
ప్రభుత్వం చేతుల్లోకి ప్రజావేదిక..!
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. కరకట్ట పక్కన ఉన్న… లింగమనేని ఎస్టేట్స్‌కు చెందిన భవనంలో నివాసం ఉంటున్నారు. దానికి ఆయన అద్దె చెల్లిస్తున్నారు. ఆ తర్వాత … ముఖ్యమంత్రి నివాసం కోసం అన్నట్లుగా.. ఆ ఇంటికి అనుబంధంగా.. ప్రభుత్వ ఖర్చుతో… ప్రజావేదికను నిర్మించారు. అక్కడ్నుంచే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. అధికారిక కార్యక్రమాలను నిర్వహించారు. కలెక్టర్ల మీటింగ్‌లే కాదు.. పార్టీ వ్యవహారాలను కూడా నడిపారు. తన ప్రైవేటు నివాసానికి ఆనుకుని ఉన్నందునే.. దానిని ప్రతిపక్ష నేత నివాసంగా గుర్తిస్తూ.. కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ.. ఆ లేఖకు స్పందన రాలేదు. కానీ.. రియాక్షన్ మాత్రం… యాక్షన్‌లోకి వచ్చేసింది.
ప్రతిపక్ష నేత నివాసంగా గుర్తించాలన్న లేఖకు ఇదే రియాక్షన్..!
ప్రజావేదికను.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష నేత నివాసంగా గుర్తించడానికి ఏపీ సర్కార్ .. సిద్దపడదన్న చర్చ కొంత కాలం నుంచి నడుస్తోంది. చంద్రబాబు.. ఆ ప్రజావేదికను.. తన కోసం కేటాయించాలని లేఖ రాసినప్పుడే… వైసీపీ నేతలు.. దాన్ని.. ప్రభుత్వ కార్యకాలాపాలకే కేటాయించాలని… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద పిటిషన్లు పెట్టారు. అప్పుడే.. ప్రభుత్వ ఇంటెన్షన్ తేలిపోయింది. మధ్యలో విజయసాయిరెడ్డి కూడా పలుమార్లు ట్వీట్లు చేసి.. చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఇప్పుడు.. అధికారికంగా ప్రజావేదికను.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ప్రైవేటు భవనాన్ని కూడా.. కూలగొట్టడానికి ప్రణాళికలు..!?
ఇప్పుడు.. చంద్రబాబు ఉంటున్న ప్రైవేటు భవనంపై కూడా… వైసీపీ నేతలు కన్నేశారు. కొన్ని రోజులుగా.. ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటామని.. అవసరం అయితే.. కోర్టుకు వెళ్తామంటూ.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులు పోతే.. చంద్రబాబును.. అమరావతిలో ప్రైవేటు నివాసంలో కూడా ఉండకుండా చేయబోతోంది. నిజానికి ప్రతిపక్ష నేతకు స్థాయికి తగ్గ నివాసాన్ని ప్రభుత్వం కల్పించాల్సి ఉంది. అలాంటిదేమీ లేకుండానే.. ప్రజావేదికను స్వాధీనం చేసుకున్నారు. ఉంటున్న ఇంటినీ కూడా.. కూలగొట్టడానికి ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు.