ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, విక్టరీ వెంకటేష్ తరువాత హీరో నాని వంతు వచ్చింది. మహేష్ బాబు సినిమా ఫంక్షన్ కు గెస్ట్ గా రావడం అన్నది పాయింట్. మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ, వెంకీ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమా యాభై రోజుల ఫంక్షన్ శిల్పకళావేదికలో ఈనెల 28న జరగబోతోంది.
ఈ స్పెషల్ ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా హీరో నాని హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. నానికి ఇండస్ట్రీలో అందరితో మంచి సంబంధాలు వున్నాయి. ఎవరు పిలిచినా హాజరవుతాడు. అలాగే నిర్మాత దిల్ రాజుతో మంచి సాన్నిహిత్యం వుంది. అందుకే ఈ ఫంక్షన్ కు నాని ప్రత్యేక అతిధిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
మహేష్ కెరీర్ లో మహర్షి సినిమా హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలాగే నైజాంలో ముఫై కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అందుకే భారీగా ఫంక్షన్ చేయాలని తలపెట్టినట్లు తెలుస్తోంది.