ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు.. అధికారికంగా “ఆంధ్రప్రదేశ్” అనే మ్యాగజైన్ ఉంది. నెల వారీగా.. ఈ మ్యాగజైన్ మార్కెట్లోకి వస్తుంది. సహజంగానే ప్రభుత్వ పత్రిక కాబట్టి.. కాంప్లిమెంటరీలు తప్ప… కొనేవాళ్లుండరు. కానీ దానికో అస్థిత్వం అయితే ఉంటుంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ పత్రికకు… ఎడిటర్‌గా ఉన్న… కందుల రమేష్ అనే సీనియర్ జర్నలిస్టును… ఐ అండ్ పీఆర్ కమిషనర్ ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు.. ఆయన టీం మొత్తాన్ని తొలగించేశారు. ట్విస్ట్ ఏమిటంటే.. అసలు రెండు వారాల కిందట పంపిన తన రాజీనామాను ఆమోదిస్తే పోయేదానికి తొలగించినట్లు ప్రకటించడం ఏమిటని.. సదరు సీనియర్ జర్నలిస్ట్.. అసంతృప్తి వ్యక్తం చేయడం.
“ఆంధ్రప్రదేశ్” విషయంలో అసలేం జరిగింది..?
కొత్తగా ఏప్రభుత్వం మారినా… ఆ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో నియమించిన వారంతా.. వైదలొగడం సహజం. అలా… ఆంధ్రప్రదేశ్ పత్రిక ఎడిటర్ కందుల రమేష్ కూడా.. ఈ నెల పన్నెండో తేదీన తన రాజీనామా లేఖను పంపారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కే నేరుగా లేఖను ఇచ్చారు. అప్పట్నుంచి ఆయన విధులకు రావడంలేదు. అయితే.. హఠాత్తుగా.. .. ఆయనను.. విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. కందుల రమేష్ అసంతృప్తికి గురై… ఓ ఘాటు లేఖను.. ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు పంపారు. రాజీనామా చేయడానికి నిరాకరిస్తేనే… ఇలా ఉద్వాసన పలుకుతారని.. రాజీనామా లేఖను మీ దగ్గర పెట్టుకుని ఎందుకిలా చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
రాజీనామా చేసినా ఉద్వాసనకు కారణాలున్నాయ్..!
అయితే.. కందుల రమేష్ .. ఆయన టీం విషయంలో… ప్రభుత్వం ఆగ్రహించడానికి చాలా కారణాలున్నాయంటున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కావొచ్చు కానీ… కొత్త సర్కార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తన విధుల్లో ఆ ప్రభావం కనిపించకుండా ఉండటం ముఖ్యమంటున్నారు. కానీ.. కందుల రమేష్ .. కొత్త ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అవమానించారని అంటున్నారు. జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రెడీ చేసిన మొదటి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌ను.. తప్పుల తడకగా తయారు చేశారంటున్నారు. జగన్ ప్రమాణం చేస్తున్న ఫోటోను కవర్ పేజీగా వేసి.. దాన్ని బ్లాక్ అండ్ వైట్‌గా ప్రింట్ చేయడంతో.. జగన్ హర్టయ్యాడని ప్రచారం జరిగింది. అదే సమయంలో.. జగన్ అనే అతను.. అనే క్యాప్షన్ ఇచ్చి.. మరింత తేడాగా వ్యవహరించారు. వీటన్నింటి కారణంగా.. ఆ ఎడిషన్ కాపీలను పంపిణీ చేయలేదు. కావాలనే కందుల రమేష్ అలా అవమానించారని.. అందుకే.. ఆయనను అవమానించారని అంటున్నారు.
ఆ ఎడిషన్ బాధ్యతలు తాను చూడలేదన్న కందుల రమేష్..!
నిజానికి టీడీపీ ఓడిపోయిన తర్వాత … ప్రభుత్వంలోని ప్రతి విభాగంగా.. వైసీపీ సానుభూతిపరులైన అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రమాణస్వీకారం చేయక ముందు… కూడా… అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పత్రిక విషయంలోనూ.. అదే జరిగింది. కవర్ పేజీని.. అందులోని అంశాలను.. తాము డిసైడ్ చేయలేదని… కందుల రమేష్ అండ్ టీం గతంలోనే వివరణ ఇచ్చింది. కానీ.. ఆయనను.. అవమానకరంగా పంపాలనుకున్న సర్కార్ అలాగే పంపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.