అమరావతి అభివృద్ధి కంటే.. అందులో ఉన్న అవినీతిని వెలికి తీయడమే జగన్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతగా నిర్ణయించుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి …ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా.. సీఆర్డీఏపై.. సమీక్ష నిర్వహించారు. అమరావతిలో నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. రాజధానిపై ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేకపోవడంతో… అమరావతిపై చాలా మందిలో సందేహాలు నెలకొన్నాయి. దీంతో.. కార్యకలాపాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో సీఆర్డీఏ సమీక్షల్లో.. జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటారని.. అమరావతి అభివృద్ధి దిశగా.. కొన్ని ప్రకటనలు చేస్తారని.. భావించారు. కానీ.. జగన్మోహన్ రెడ్డి.. సమీక్షలో పూర్తిగా.. అవినీతిపైనే దృష్టి కేంద్రీకరించారు.
ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో తేల్చాలని.. అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ పరిధిలో ప్రతి పనిలోనూ అవినీతే జరిగిందని.. మంత్రి బొత్స సమీక్ష తర్వాత మీడియా ముందు వ్యాఖ్యానించారు. రైతులకు ప్లాట్ల కేటాయింపు, పనుల కేటాయింపులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. ప్లాట్ల కేటాయింపులో అనుయాయులకు ప్రాధాన్యం ఇచ్చారని… అక్రమాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులకు ఆదేశించామని ప్రకటించారు. అవినీతి కూపం నుంచి బయటపడ్డాక రాజధాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ అవినీతి పనులను కొనసాగించబోమని బొత్స నేరుగా ప్రకటించారు.
అంతా అవినీతి జరుగిందని.. నేరుగా బొత్సనే చెప్పారు కాబట్టి.. ఇక పనులూ జరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. రాజదానికి ఇచ్చిన భూమినిఎవరైనా ఎవరైనా ఇచ్చేయాలని అడిగితే తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. కరకట్ట అక్రమకట్టడాల తొలగింపు ప్రజావేదికతో మొదలైందని.. కొనసాగిస్తామని ప్రకటించారు. త్వరలో మళ్లీ సీఆర్డీఏ సమావేశం ఉంటుందని.. అందులో కీలక నిర్ణయాలు తీసుకుంటామని బొత్స చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. అమరావతిలో ఇప్పుడిప్పుడే కదలిక వచ్చే అవకాశం లేదు.