పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రాం శంకర్‌కి `బంపర్ ఆఫర్` తప్ప హిట్టు తగల్లేదు. అయినా సరే – శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. విజయాలేం దక్కకపోయేసరికి తాను కూడా సినిమాలకు దూరమైపోయాడు. ఎట్టకేలకు ఇప్పుడు మరో ప్రాజెక్టుని పట్టాలెక్కించాడు. కృష్ణ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో తొలిసారి మెగాఫోన్ పట్టబోతున్నాడు. కొంతమంది వైకాపా పెద్దలు ఈ సినిమాకి నిర్మాతగా మారినట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్‌కి వైకాపాతో సంబంధాలున్నాయి. పూరి సోదరుడు వైకాపా పార్టీ తరపున నర్సీపట్నం ఎం.ఎల్.ఏగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికీ వైకాపా నేతలే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నట్టు టాక్. ఈసారైనా పూరి తమ్ముడు నిలదొక్కుకుంటాడో లేదో చూడాలి.