ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ… దూకుడుగా ఉంది. తెలుగుదేశం పార్టీపై మాత్రమే కాదు.. వైసీపీపై కూడా… ఆ పార్టీ నేతలు తమ కన్నేశారు. కొద్ది రోజుల కిందట.. బీజేపీలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ నేతలు చేరారు. వారిద్దరూ నియోజకవర్గ స్థాయి నేతలే. అధికార పార్టీని వదిలి పెట్టి… ఇలా బీజేపీలో చేరడం.. అదీ కూడా… మిత్రపక్ష పార్టీలా వ్యవహరిస్తున్న పార్టీలో చేరడం..చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇది మారుతున్న రాజకీయానికి.. నాంది అని బీజేపీ నేతలు అంటున్నారు. అదే సమయంలో.. వైసీపీ నేతలను.. ఓ స్థాయిలో.. బీజేపీ నేతలు విమర్శించడం మారుతున్న రాజకీయానికి నాందిలా కనిపిస్తోంది.
హోదాతో బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నంలో వైసీపీ..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేకపోయినా ప్రత్యేకహోదా అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. ఓ వైపు బీజేపీకి పూర్తి మెజార్టీ ఉందని చెబుతూనే.. మరో వైపు..హోదా అంశాన్ని.. అన్ని సమావేశాల్లోనూ ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. దీనిపై బీజేపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. హోదా ముగిసిన అధ్యాయమని.. అయినా ప్రజలను మభ్యపెడుతున్నారని అంటున్నారు. బీజేపీ నేత పురంధేశ్వరి కూడా అదే అన్నారు. ఇప్పటి వరకూ… బీజేపీ నేతలు.. హోదా ముగిసిన అధ్యాయమని చేసిన ప్రకటనలపై వైసీపీ నేతలు స్పందించలేదు.. కానీ తొలి సారి వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ… పురందేశ్వరికి కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేకహోదా బీజేపీ మేనిఫెస్టోలో ఉందన్న సంగతి పురందేశ్వరి మర్చిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు.
టీడీపీ వ్యూహమే వైసీపీ అమలు చేస్తోందని అనుమానం..!
బీజేపీని ఎదగనీయకుండా… గతంలో తెలుగుదేశం పార్టీ.. ప్రత్యేకహోదా అంశాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టిందని..బీజేపీ భావిస్తోంది. ఇప్పుడు.. అదే వ్యూహాన్ని వైసీపీ కూడా అమలు చేస్తూ.. తమను.. దెబ్బకొట్టాలని చూస్తోందని..బీజేపీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే .. వైసీపీ విషయంలో..గతంలో ఉన్నంత సానుకూలంగా ఎవరూ మాట్లాడటం లేదు. ప్రజావేదిక కూల్చివేత విషయంలో… బీజేపీ నేతలు భిన్నంగా స్పందించారు. అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేయాలి కానీ.. ఒక్కదాన్నే కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. పురందేశ్వరిఅయితే..కూల్చివేయాల్సిన అవసరం ఏముందని.. ఇతర అవసరాలకు వాడుకోవచ్చు కదా అని ప్రశ్నించారు.
జగన్ వైఖరితో బీజేపీ అలర్ట్..! వైసీపీపై విమర్శలు షూరూ..!
భారతీయ జనతా పార్టీ.. ఏపీ విషయంలో.. సమీకరణాలను… పకడ్బందీగా అంచనా వేసుకుంటోందని.. బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుతోనే స్పష్టమవుతోందని.. రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. వైసీపీతో.. అంత దగ్గర కాదని.. విమర్శలతో నిరూపిస్తున్నారు. తమను ప్రత్యేకహోదా పేరుతో.. మళ్లీ ప్రజల్లో విలన్ చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో ప్రారంభమయింది. టీడీపీ నేతలను చేర్చుకుని బలపడాలనుకుంటున్న బీజేపీకి… జగన్ వైఖరి.. కాస్తంత ఇబ్బందికరంగా మారిందంటున్నారు. టీడీపీ నేతలను… చేర్చుకోవడంలో వైసీపీ సహకారం ఉన్నా… చివరికి.. ఆ ఫలం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు బీజేపీలో ప్రారంభమయ్యాయంటున్నారు. ముందు ముందు ఈ రాజకీయ పోరాటం మరింత ముదిరే అవకాశం ఉందంటున్నారు.
భయం..భయంగా వైసీపీ కౌంటర్..!
కానీ బీజేపీ.. వైసీపీ భయపడుతోంది. ఆ విషయం… బీజేపీని తమ పార్టీ నేతలు విమర్శించే వార్తలను… సాక్షి మీడియాలో కనిపించకనీయకుండా చేయడంతోనే తేలిపోతోంది. వాసిరెడ్డి పద్మ ప్రత్యక్ష ప్రసారాన్ని సాక్షి టీవీ … చంద్రబాబును విమర్శిస్తున్నంత సేపు చూపించింది. కానీ ఎప్పుడైతే.. ప్రత్యేకహోదాపై… బీజేపీపై విమర్శలు ప్రారంభించారో.. అప్పుడు… లైవ్‌ను కట్ చేసేశారు. సాక్షి చానల్‌కు చెందిన యూ ట్యూబ్ చానల్ లోనూ ఆ లైవ్ ను అక్కడి వరకే ఉంచారు. బీజేపీపై విమర్శలు చేయడాన్ని ఉంచలేదు. కానీ ఇతర చానళ్లలో మాత్రం.. ఆ ఫుటేజీ ఉంది. అందుకే.. బీజేపీనిపైకి విమర్శించినా.. లోపల మాత్రం భయపడుతున్నారని స్పష్టమవుతోంది.