పట్టిసీమ ప్రాజెక్ట్ మరో సారి హాట్ టాపిక్ అవుతోంది. నాలుగు రోజుల కిందట.. పట్టిసీమ పంపులను.. ఇరిగేషన్ అధికారులు ప్రారంభించారు. ఒకటి, రెండు రోజుల్లో… గోదావరి నీరు.. కృష్ణాకు చేరనున్నాయి. ఈ సమయంలో.. తెలుగుదేశం పార్టీ నేతలు.. ఏపీ సర్కార్‌ను టార్గెట్ చేయడం ప్రారంభించారు. పట్టిసీమ దండగ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ కూడా ఓ విధానంగా పెట్టుకుని పోరాడటమే దీనికి కారణం.
పట్టిసీమ దండగని వాదించిన జగన్మోహన్ రెడ్డి..!
” పట్టిసీమ నుంచి… వందల కోట్ల కరెంట్ ఖర్చు పెట్టి.. గోదావరి నీళ్లు ఎత్తి పోసి.. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. పట్టి సీమ వల్ల.. ఒక్క రైతుకూ ఉపయోగం లేదు. కేవలం అవినీతి కోసమే ఆ ప్రాజెక్టును నిర్మించారు..” .. అసెంబ్లీతో పాటు.. బయట కూడా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల సారాంశం ఇది. దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి అప్పటి అధికారపక్షం టీడీపీ చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అంత బలంగా తన వాదన వినిపించారు. ప్రాజెక్ట్‌లో అవినీతి అని ఆరోపించడం ఒక ఎత్తు అయితే.. అసలు ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం లేదని వాదించడం మరో ఎత్తు. వైసీపీ అదే చేసింది. పట్టిసీమ వల్ల ఉపయోగం లేదన్నది. జూన్‌లో నీళ్లు ఇచ్చే అవకాశమే లేదని వాదించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇప్పుడు అధికార పక్షానికి వచ్చారు. అందుకే కొత్త చిక్కులు ప్రారంభమయ్యాయి.
పట్టిసీమ నుంచి నీళ్లు వదలక తప్పని పరిస్థితి…!
అవకాశం వస్తే పట్టిసీమ వృధా అని నిరూపించాలని.. వైసీపీ సర్కార్‌కు మాత్రం ఉండకుండా ఉంటుందా..?. సరైన సమయంలో వర్షాలు పడి.. కృష్ణా డెల్టాలో.. వ్యవసాయ పనులు ప్రారంభమయి ఉంటే.. ప్రభుత్వం ఏదో విధంగా.. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం లేదని నిరూపించే ప్రయత్నం చేసి ఉండేది. కానీ.. ఈ ఏడాది… సరైన సమయానికి వర్షాలు పడలేదు. సాగు కోసం అదను దాటిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో.. పట్టిసీమ పంపులు ఆన్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. సైలెంట్‌గా ఆన్ చేయమని ఆదేశాలిచ్చారు. గోదావరి నీరు అందుబాటులోఉన్నదాన్ని బట్టి.. స్వల్పంగా అయినా.. తరలింపు ప్రారంభించారు. కృష్ణా డెల్టాను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
దమ్ముంటే ఆపేయాలని టీజ్ చేస్తున్న టీడీపీ..!
పట్టిసీమను కట్టి… డెల్టాను కాపాడమని చెబుతున్న టీడీపీ.. అప్పట్లో విమర్శించిన వైసీపీని.. కార్నర్ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి వివిద సందర్భాల్లో పట్టిసీమ ప్రాజెక్ట్ దండగన్న.. వీడియోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి.. నీళ్లు వదిలిన దృశ్యాలను.. పెడుతున్నారు. ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి.. మాట తప్పారు.. మడమ తిప్పారని.. విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడే దమ్ము ఉంటే.. నీటి పంపింగ్ ఆపేయాలని అంటున్నారు. అవినీతి జరిగిందని అంటున్నారు కాబట్టి.. ప్రాజెక్ట్‌ను ప్రజావేదికలా కూల్చివేయాలని.. సవాల్ చేస్తున్నారు. ఈ విషయంలో.. వైసీపీకి కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందింది.