అనంతపురం జిల్లాలో టీడీపీకి దూరమయ్యే నేతలెవరో హైకమాండ్‌కు క్లారిటీ వచ్చింది. ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ జిల్లా తొలి సమన్వయ కమిటీ సమావేశానికి గైర్హాజరైన నేతలంతా.. టీడీపీకి దూరమైనట్లేనన్న అభిప్రాయం… ఆ పార్టీ ముఖ్యనేతలలో ఏర్పడింది. సమావేశానికి మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి గానీ, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి గానీ, ఇటీవల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగిన జేసీ పవన్‌రెడ్డి గానీ, జేసీ అస్మిత్‌రెడ్డి గానీ సమావేశానికి హాజరుకాలేదు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కూడా సమావేశానికి రాలేదు.
ముందస్తుగా సమావేశాన్ని ఖరారు చేసినప్పటికీ.. వారెవరూ హాజరు కాలేదన్న విషయం మాత్రం టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సమావేశానికి వచ్చిన వాళ్లే టీడీపీలో ఉంటారన్న అభిప్రాయం ముందు నుంచీ ఏర్పడటంతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా… సమావేశం జరిగిన తీరు గురించి ఆరా తీశారు. ఎవరెవరు రాలేదు.. వచ్చిన వాళ్లు ఏం మాట్లాడారో.. తెలుసుకున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలో చేరడంపైనా సమావేశంలో నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
వైసీపీ నుంచి వస్తున్న బెదిరింపుల నేపధ్యంలో తమను తాము కాపాడుకోవడంతో పాటు.. క్యాడర్ ను నిలబెట్టుకోవాలంటే.. తప్పనిసరిగా.. టీడీపీని వీడాలన్న ఒత్తిడి వస్తున్న విషయంలో సమావేశంలో చర్చ జరిగింది. జేసీ సోదరులు రాకపోవడానికి తాడిపత్రిలో మారుతున్న పరిస్థితులకు సంబంధాలున్నాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా తాడిపత్రిలో దాడులు .. ప్రతిదాడులు జరుగుతున్నాయి. తరచూ జేసీ సోదరుల పేరు బయటకు వస్తోంది. ఈ క్రమంలో… వారు.. టీడీపీ సమావేశాలకు దూరంగా ఉండటంతో.. ఆసక్తి కలిగించేదే. కనీసం.. ఇతర పార్టీల్లో చేరకపోయినా టీడీపీకి దూరంగా ఉన్నా.. ఒత్తిడి తగ్గుతందని.. వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.