మైహోమ్ గ్రూప్ యజమానికి జూపల్లి రామేశ్వరరావుతో పాటు ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీలు, కార్యాలయాల్లో… ఐటీ దాడులు జరగడం… ఒక్కసారిగా… కలకలం సృష్టించింది. ఎందుకంటే.. ఆయన తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌కు అత్యంత సన్నిహితుడు. అలాగని బీజేపీకి వ్యతిరేకం కాదు. బీజేపీకి కూడా.. హితుడే. బీజేపీ కోసం ఆయన చాలా చేశారని.. తన చేతిలోకి వచ్చిన మీడియాతో చాలా చేస్తున్నారన్న ప్రచారం ఉంది. మరి ఇలాంటి సమయంలో… ఒక్క సారిగా.. ఆయనపై ఐటీ గురి ఎందుకు పడింది..అనే సందేహం చాలా మందిలో వస్తోంది. అసలు గుట్టు టీవీ9 డీల్‌లోనే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఐటీ, ఈడీలకు రవిప్రకాష్ చేసిన ఫిర్యాదు ఆధారంగానే..?
టీవీ9 నుంచి తనను బలవంతంగా తొలగించడంతో పాటు.. కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేస్తూండటంతో… రవిప్రకాష్.. జూపల్లి రామేశ్వరరావుపై బదులు తీర్చుకోవాలన్న లక్ష్యంతో.. ఆయన వ్యాపార వ్యవహారాలపై ఐటీ, ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ఫిర్యాదు చేసిన ఈమెయిల్ కాపీ సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆ ఫిర్యాదు ఆధారంగానే… ఐటీ, ఈడీలు దాడులు చేస్తున్నాయని ప్రచారం జరిగింది. దాదాపుగా వంద మందికిపైగా ఐటీ అధికారులు.. రోజంతా సెర్చ్ చేయడం అంటే.. చాలా పెద్ద ప్రణాళికతోనే వచ్చి ఉంటారన్న అభిప్రాయం వ్యాపారవర్గాల్లో ఏర్పడింది.
ఎప్పుడో ఫిర్యాదు.. ఇప్పుడే ఎందుకు స్పందన..?
టీవీ9 పెట్టుబడుల చరిత్రను.. రవిప్రకాష్.. ఈడీ ముందు పెట్టారు. టీవీ9లో పెట్టుబడుల కోసం మొదట్లో ఓ మారిషస్ కంపెనీ నుంచి రూ. 60 కోట్లు వచ్చాయి. ఆ మారిషస్ కంపెనీ విదేశీ పెట్టుబడుల చట్టాలన్నింటినీ ఉల్లంఘించి నిధుల వరద పారించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మరీ వచ్చిన నిధుల గురించి.. రవిప్రకాష్ ఈ మెయిల్‌లో చెప్పారు. రవిప్రకాష్ టీవీ9 అమ్మకపు లావాదేవీల గుట్టును కూడా… ఈమెయిల్‌లో ఉంచారు. టీవీ9 అమ్మకం… వ్యవహారంలో… రూ. 294 కోట్ల నగదు చేతులు మారిందని..ఈ లావాదేవీ పూర్తిగా … నగదు రూపంలో .. హవాలా మార్గంలో నడిచిందని.. ఆరోపించారు. ఇంత దారుణం అంటే.. ఉగ్రవాదులకు.. నిధులు సరఫరా చేసే హవాలా నెట్‌వర్క్.. ద్వారా నిధులు తరలించారని.. ఆరోపించారు. నిజానికి గతంలోనే… ఫిర్యాదు చేశారు. కానీ పట్టంచుకోలేదు. తన ముందస్తు బెయిల్ పై వాదనల్లో కూడా.. ఇవే అంశాలను.. కోర్టు ముందుంచారు. దీన్ని అలంద మీడియా ఖండించింది. అయితే.. ఇప్పుడు.. ఈడీ, ఐటీ రంగంలోకి దికాయి.
మారుతున్న రాజకీయ పరిణామాలతోనేనా..?
టీఆర్ఎస్‌కు ఇటీవలి కాలంలో బీజేపీతో సన్నిహిత సంబంధాలు లేవు. మోడీతో కూడా.. కేసీఆర్ అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో.. తెలంగాణ సర్కార్ తనను వేధిస్తోందని.. తెలంగాణలో మీడియా మొత్తం రామేశ్వరరావు గుప్పిట్లోకి పోవడానికి ప్రభుత్వ సహకారం ఉందని భావిస్తున్న రవిప్రకాష్.. బీజేపీ పెద్దల వద్దకు… సాయం కోసం వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. అసలేం జరిగిందో చెప్పి.. సాయం కోరినట్లు తెలుస్తోంది. రవిప్రకాష్ దేశవ్యాప్తంగా పలుకుబడి ఉన్న జర్నలిస్టు. గుజరాతీ టీవీ9ని కూడా నెంబర్ వన్ గా నిలబెట్టారు. ఆ పలుకుబడి కూడా ఉండటంతో.. బీజేపీ పెద్దలు… రవిప్రకాష్ చేసిన ఫిర్యాదుపై స్పందించారని భావిస్తున్నారు. మొత్తానికే.. ఈ సోదాలతో.. మీడియా డీల్స్ కాకుండా… రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కూడా… బయటకు వస్తే.. జూపల్లి రామేశ్వరరావుకు.. ఇబ్బందికర పరిణామాలే ఎదురవుతాయన్న అంచనా వ్యాపార వర్గాల్లో ఉంది.