బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌పై హైదరాబాద్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఎందుకంటే.. ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న యాప్ తమకు మంచి సేవలు అందించలేదని.. ఎవరో ఇద్దరు పిర్యాదు చేశారు. దానిపై పోలీసులు ముందూ వెనుకా ఆలోచించకుండా కేసు నమోదు చేశారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నంత మాత్రాన వాళ్లు బాధ్యులైపోతారా..? సినిమా వాళ్లపై కేసులు నమోదు చేస్తే పబ్లిసిటీ వస్తుందని.. పోలీసులు ఫీలవుతున్నారా..? అసలు.. నేరం ఏమిటో తెలుసుకోకుండా.. కేసులు నమోదు చేస్తారా..?
బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు హృతిక్‌పై కేసా..?
క్యూట్ డాట్ ఫిట్, కల్ట్ డాట్ ఫిట్ , ఈట్ డాట్ ఫిట్ అంటూ… హెల్దీ ఫుడ్, డైట్, జిమ్ అంటూ వ్యాపారం చేస్తున్న స్టార్టప్ కు.. హృతిక్ రోషన్ బ్రాండ్ అంబాసిడర్. హెల్త్ పై కన్సర్న్ పెరుగుతున్న ఈ టైంలో.. సహజంగానే ఆ యాప్‌కు విపరీతంగా.. ఆదరణ లభించింది. దానికి తగ్గట్లుగానే సర్వీసులు ఉన్నాయి. కొన్ని వేల మంది.. ఆ సంస్థ సర్వీసులు పొందుతున్నారు. యాప్ రేటింగ్ కూడా బాగుంది. ఇలాంటి సమయంలో.. ఓ ఇద్దరు వ్యక్తులు.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. తాము సబ్స్క్రిప్షన్ కట్టామని… చెప్పిన సేవలు అందించలేదని.. ఫిర్యాదు చేశారు. అంతే.. పోలీసులు వెంటనే… బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న హృతిక్ సహా.. ఆ సంస్థ యజమానులందరిపై కేసులు పెట్టారు.
అక్రమాలు చేస్తూంటే ప్రభుత్వ విభాగాలకేం సంబంధం ఉండదా..?
హైదరాబాద్ పోలీసుల హడావుడి ఇంతటితో ఆగలేదు. హీరా గోల్డ్ అనే కంపెనీ వ్యవహారంలోనూ సెలిబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు. చిక్కుకున్నారు. బంగారం, వజ్రాలు సులభ వాయిదాల్లో పొందండంటూ హీరా కంపెనీ ఏకంగా అయిదు వేల కోట్లు పోగేసింది. కంపెనీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో బడా బాలీవుడ్ స్టార్ హీరోలు పాల్గొనడమే ఇంత భారీగా డిపాజిట్లు పెరగడానికి కారణమని పోలీసులు చెప్పుకొచ్చి.. వారికీ నోటీసులు జారీ చేస్తున్నారు. అసలు ఆ కంపెనీ డిపాజిట్లు నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూంటే.. సంబంధిత రెగ్యులారిటీ సంస్థలు.. పట్టించుకోకుండా… ప్రచారం చేశారంటూ.. సెలబ్రిటీలపై కేసులు పెట్టేస్తున్నార.ు
వ్యాపార ప్రకటనల్లో ఉండే నటుల్ని ఎందుకు లైట్ తీసుకుంటారు..?
సాధారణంగా… ఇతర నటీనటులు చాలా మంది.. వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ ఉంటారు. వారెవరికి ఇలాంటి చిక్కులు రావు. కేవలం గుర్తింపు ఉంది కాబట్టి.. సెలబ్రిటీలను పోలీసులు టార్గెట్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు.. తమ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేసినందుకు.. ఆ సంస్థలు డబ్బులు చెల్లిస్తుంటాయ్. వారి అసోసియేషన్ అంత వరకే. కంపెనీలు తప్పులు చేస్తే… బ్రాండింగ్ చేసినందుకు కేసులు పెట్టడం ఏమిటో.. ఎవరికీ అర్థం కావడంలేదు. క్రికెటర్ ధోని అమ్రపాలి అనే రియల్ ఎస్టేట్ సంస్థ విషయంలోనూ ఇలా చిక్కులు తెచ్చుకున్నారు. నిజంగా ఇలాంటి విషయాల్లో సెలబ్రిటీల్ని నిందితుల్ని చేయాలనుకుంటే.. అసలు వ్యాపార ప్రకటనల్నే నిషేధించాల్సి ఉంటుంది.