ఆంధ్రప్రదేశ్‌కు ఏది మంచిదైతే అదే చేస్తామంటూ.. పోలోమని పోయి.. భారతీయ జనతా పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ ఎంపీలకు.. బడ్జెట్ చిక్కులు వచ్చి పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు.. రావాల్సిన విభజన హామీలు రావాలంటే.. కచ్చితంగా బీజేపీలో చేరాలన్నట్లుగా మాట్లాడిన.. ఎంపీలు.. బడ్జెట్ తర్వాత పత్తా లేకుండా పోయారు. బీజేపీలో చేరి.. గొప్ప ఘనకార్యం చేసినట్లుగా.. మీడియా ముందు ఇంటర్యూలు కూడా ఇచ్చిన సుజనా చౌదరి.. కనీసం.. బడ్జెట్‌పై… తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో కూడా వ్యక్తీకరించలేదు. ఇక సీఎం రమేష్ అసలు మీడియాతోనే మాట్లాడలేదు. టీజీ వెంకటేష్.. అడిగినా కూడా బడ్జెట్‌పై తన అభిప్రాయం చెప్పరమో..?
ముగ్గురు ఎంపీల పరిస్థితి… స్పందించలేని విధంగా అయిపోవడంతో.. మరో టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. సీఎం రమేష్ , సుజనా చౌదరి, టీజీ వెంకటేష్.. మోడీని కలిసిన ఫోటోను.. పెట్టి.. సెటైర్లు వేశారు. ఏపీని ఉద్దరించడానికి పార్టీ మారారని చెప్పుకున్నారు కానీ.. బడ్జెట్లో అసలు బండారం బయట పడిందని.. మిమ్మల్ని మీరు ఉద్దరించుకోవడానికి పార్టీ మారారని తేలిపోయిందని.. ఘాటుగానే విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో కూడా… ఇతర వర్గాల నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు.. పార్లమెంటరీ పార్టీ నేతగా సుజనా చౌదరితో పాటు.. ఎంపీలు కూడా … బడ్జెట్ ప్రసంగం చదువుతున్నప్పుడే… నిరసన వ్యక్తం చేసేవారు. ఎన్డీఏలో భాగంగా ఉన్నప్పటికీ.. వారు ఆందోళనలో వెనక్కి తగ్గేవాళ్లు కాదు. ఆ తర్వాత పార్లమెంట్ బయట, లోపలా.. ఏపీకి న్యాయం చేయాలని.. చేసే పోరాటాలు.. ఓ రేంజ్లో ఉండేవి. అందుకే.. ఇప్పుడు.. వారిని అందరూ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. బడ్జెట్లో ఎప్పటిలాగే… కేంద్రం ఏపీకి చిల్లిగవ్వ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత కేంద్రంపై.. చేయాల్సిన పోరాటాలు ఇప్పుడు లేవు. అలా పోరాడిన వాళ్లంతా బీజేపీలో ఉన్నారు. అదీ తేడా..!?