కర్ణాటక రాజకీయాలు చిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. ప్రభుత్వం పడిపోవడానికి అవసరమైనంత మంది ఎమ్మెల్యేలు.. రాజీనామాలు చేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారున్నారు.. అధికార జేడీఎస్‌కు చెందిన వారున్నారు. వీరిలో అత్యధికులు.. ఆయా పార్టీల్లో అత్యంత సీనియర్లు కావడం… పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉన్నవారే కావడంతో.. రాజకీయ సంక్షోభం కొత్త పుంతలు తొక్కుతోంది.
కర్ణాటకంలో బీజేపీది గెస్ట్ రోలేనా..?
అధికార కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ సర్కారుకు మద్దతుగా ఉన్న పదమూడు మంది ఎమ్మెల్యేలు .. రాజీనామా చేయడం అంటే .. కచ్చితంగా.. దాని వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉంటుందని.. రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికైనా అర్థం అయిపోతుంది. అయితే ఆ మాస్ట్ర మైండ్ ఎవరన్నది.. ఇప్పటికీ క్లారిటీ రాలేకపోయింది. అయితే బీజేపీ మాత్రం కాదన్నది తాజా పరిణామాలతో బయటపడుతున్న సత్యం. నిజంగా బీజేపీనే ఈ రాజీనామాల వెనుక ఉంటే.. ఆ ఎమ్మెల్యేలందర్నీ..ఉన్న పళంగా క్యాంపునకు తీసుకెళ్లిపోయి.. తాము చేయాల్సింది చేస్తుంది. కానీ.. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలను మాత్రమే బీజేపీ ఆకర్షించగలిగింది. మిగతా వాళ్లను కాంగ్రెస్ బుజ్జగిస్తోంది. కొంత మంది తగ్గుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
సీఎంగా సిద్దరామయ్య పేరు ప్రచారంలోకి ఎలా..?
సీఎం పదవిని వదులుకుని… మరీ… జేడీఎస్‌కు… మద్దతిచ్చింది కాంగ్రెస్ పార్టీ. సిద్దరామయ్య.. సిట్టింగ్ సీఎంగా ఉన్నప్పటికీ.. రాజీనామా చేసి.. కుమారస్వామికి అవకాశం ఇచ్చారు. సమన్వయ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పటికీ.. ఆయన అప్పుడప్పుడూ.. తానే సీఎం కావాలని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని.. ప్రకటనలు చేస్తూ ఉండేవారు. దానికి తగ్గట్లుగా కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ప్రకటనలు చేసేవారు. ఇప్పుడు.. రాజీనామా చేసిన వారిలో కొంత మంది కూడా.. సిద్దరామయ్య.. సీఎం అయితేనే.. రాజీనామాలు ఉపసంహరించుకుంటామని ప్రకటనలు చేస్తున్నారు. దీంతో.. రాజకీయం తేడాగా మారుతోందని.. ఈ గేమ్ ప్లాన్ కాంగ్రెస్ నుంచే ప్రారంభమైందా.. అన్న చర్చ ప్రారంభమయింది.
ఇప్పుడు జేడీఎస్‌కు మద్దతివ్వాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదా..?
కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌కు సీఎం పీఠం అప్పగించడానికి ప్రధాన కారణం… లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడం. కానీ టాస్క్ అట్టర్ ఫ్లాపైపోయింది. ఇక ముందు.. జేడీఎస్‌ను భరించాల్సిన అవసరం ఏముందన్న చర్చ.. కర్ణాటక కాంగ్రెస్‌లో… లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి జరుగుతోంది. దాని ఫలితమే.. ప్రస్తుత రాజకీయ సంక్షోభం అన్న అనమానాలు కూడా లేకపోతే. మొత్తానికి .. కర్ణాటకంలో అసలు ప్రధాన పాత్ర ఎవరిదో మాత్రం .. ఎవరికీ అర్థం కాకుండా.. రాజకీయాలు చేసేస్తున్నారు.