రకుల్ ప్రీత్ సింగ్ – అందం, అభినయం కలబోసిన తార. గ్లామర్ విషయంలో ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కాకపోతే ‘ఏ’ సర్టిఫికెట్ రేంజులో మాత్రం భయపెట్టలేదు. ఇప్పుడు మాత్రం ఆ అవసరం వచ్చింది. పాత్ర అలాంటిది మరి. `మన్మథుడు 2`లో అవంతికగా కనిపిస్తోంది రకుల్. ఆ పాత్రని ఓ టీజర్ ద్వారా పరిచయం చేశారు. ఇంట్లో పద్ధతిగానే ఉంటుంది. బయటకు వస్తే మాత్రం రెచ్చిపోతుంటుంది. డ్యూయల్ సిమ్ అన్నమాట. ‘చల్లని గాలి లాంటి అమ్మాయి’.. బయటకు వస్తే పెను తుఫానుగా మారిపోతుంటుంది. ”ఇప్పటి దాకా యూ సర్టిఫికెట్ ప్రయత్నించాను. ఇప్పుడు యూ సర్టిఫికెట్ చూపిస్తా” అనే డైలాగ్‌ని బట్టి ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఏమిటో అర్థం చేసుకోవొచ్చు. అన్నట్టు రకుల్ దమ్ములాగిన షాట్ కూడా ఒకటుంది. మున్ముందు.. సినిమాలో ఇంకేం చూపిస్తారో?? రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. సమంత ఓ చిన్న పాత్రలో కనిపించనుంది. ఆగస్టులో విడుదల చేయనున్నారు.