ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించడానికి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసువుగా ఇచ్చేసిన హామీల్లో ఒకటి.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం. అంతకు ముందు ప్రభుత్వం.. అర్టీసీ విలీనం అనేది.. అసాధ్యమని నేరుగాప్రకటించింది. ఇప్పటికీ అదే చెబుతోంది. కానీ.. ఏపీ సర్కార్ మాత్రం.. ఆర్టీసీని సర్కార్లో విలీనం చేసి తీరుతామని.. ప్రకటించి. ఆ మేరకు.. ఆంజనేయ రెడ్డి నేతృత్వంలో… ఓ కమిటీని నియమించింది. ప్రభుత్వంపై భారం పడకుండా… ఆర్టీసీని ప్రభుత్వంలో ఎలా విలీనం చేయాలో సూచనలు చేయాలని… ఆ కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఆంజనేయరెడ్డి కమిటీ అనేక మార్గాలు పరిశీలిస్తోంది. కానీ.. ఏపీఎస్ఆర్టీసీకి ఉన్న “లోన్ లగేజీ” .. నిర్వహణా నష్టాలు… ప్రభుత్వాన్ని కుదేలు చేస్తాయన్న భావన.. అందరిలోనూ ఏర్పడుతోంది.
నిజానికి ప్రభుత్వ రంగ సంస్థలను.. వీలైనంత వరకు.. ముఖ్యంగా నష్టాల్లో ఉన్న పీఎస్యూలను తగ్గించుకోవాలని.. ప్రభుత్వాలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. కార్మిక సంఘాలు.. ఇతర రాజకీయ కారణాల వల్ల పరిమితంగానే.. ఈ ప్రక్రియ నడుస్తోంది. అయితే కేంద్రంలో తిరుగులేని విధంగా రెండో సారి అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ.. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనే కాదు.. లాభాల్లో ఉన్న వాటిలో కూడా పెట్టుబడుల ఉపసంహరణ చేసుకోవాలని.. నిర్ణయించుకుంది. ఈ మేరకు.. ఆర్థిక మంత్రులు.. సహాయమంత్రులు పదేపదే ప్రకటిస్తున్నారు. దానికి భిన్నంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం.. వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన ఏపీఎస్ ఆర్టీసీని సర్కారులో విలీనం చేస్తామని ప్రకటించేసింది. కార్యాచరణ కూడా ప్రారంభించింది.
మూడు నెలల్లో విలీనంపై నివేదిక వస్తుది. ఆ తర్వాతైన.. ప్రక్రియ ప్రారంభించక తప్పదు.. అలా చేయాలంటే.. ఆర్టీకి ఉన్న దాదాపుగా రూ. ఏడు వేల కోట్ల అప్పులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే.. రోజువారీగా వస్తున్న రూ. కోట్ల నష్టాలను కూడా.. ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో విలీనం చేస్తే.. ఇక ప్రైవేటు బస్సులు అద్దెకు తీసుకునే విధానం ఉండదు. అంటే.. కొత్త బ స్సులు కొనుగోలు చేయాలి. ఎలా లేదన్నా.. కనీసం.. ఈ బడ్జెట్లో రూ. ఐదు వేల కోట్లయినా కేటాయించాలన్న అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వం ఇప్పుడు.. రూపాయి కూడా కేటాయించే పరిస్థితుల్లో లేదు.