తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే టీడీపీ బీజేపీ లోకి విలీనం అవుతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం లేపుతున్నాయి.
జేసీ ప్రభాకరరెడ్డి వ్యాఖ్యానిస్తూ, తాము బీజేపీతో కొత్తగా ప్రేమలో పడాల్సిన అవసరం లేదని, గతంలోని బీజేపీతో కలిసే ఉన్నామని, ఇప్పుడు బీజేపీతో తాళి కట్టించుకుని కాపురం చేస్తామని తన స్టైల్ లో వ్యాఖ్యలు చేశారు. మోడికి చంద్రబాబు నాయుడు ఐడియాలు అవసరం ఉందని, ఆ రకంగా బీజేపీకి కూడా టిడిపి కావాలని, కాబట్టి టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఉత్తమ మార్గం అనే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు గాని ఉండరు అంటూ ఆయన అన్నారు.
అయితే ఇది కేవలం వెటకారంగా చేసిన వ్యాఖ్యలా, లేక ఇందులో నిజం ఏమైనా ఉందా, లేక తాను బీజేపీ వెళ్ళడం కోసం ఇటువంటి వాదన ఎత్తుకున్నాడా అన్నది తేలాల్సి ఉంది.