వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో… లుకలుకలు ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేతలకు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వేవ్లెంగ్త్ కుదరడం లేదని.. సెక్రటేరియట్లో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో… దీనికి సంబంధించిన మొదటి సూచన… బయటపడింది. సీఆర్డీఏ పై.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన కీలక సమావేశానికి.. పురపాలక మంత్రి… బొత్స సత్యనారాయణ హాజరు కాలేదు. సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరావతి నిర్మాణంలో జరిగిన అవకతవకలపై… జగన్ ఆరా తీశారు. గత సమీక్షలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఇప్పుడు మాత్రం డుమ్మాకొట్టారు.
అమరావతి విషయంలో .. బొత్స చేస్తున్న ప్రకటనలు.. జగన్మోహన్ రెడ్డిని ఆగ్రహానికి గురి చేశాయని చెబుతున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బొత్స.. అమరావతి ఆగదని.. నిర్మాణాలు కొనసాగుతాయని చెబుతున్నారు. అయితే.. ఇది ప్రభుత్వ విధానానికి విరుద్ధం. దీనిపై… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఓ సారి.. బొత్సను పిలిపించి క్లాస్ తీసుకున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా తీసుకున్న నిర్ణయాలను మాత్రమే మీడియా ముందు ప్రకటించాలని.. ప్రభుత్వంలో ఎలాంటి చర్చ జరగకుండా… అమరావతి నిర్మాణం కొనసాగుతుందని ఎలా ప్రకటిస్తారని.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామంతో.. బొత్స షాక్కు గురయ్యారని చెబుతున్నారు.
సీనియర్ మంత్రిగా.. తనకు ఏ మాత్రం స్వేచ్చ ఇవ్వడం లేదని… ఆయన భావిస్తున్నట్లుగా… ఆయన మంత్రిత్వ శాఖలో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అమరావతి విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. ఇక ఒక్క ఇటుక కూడా అక్కడ పడకూడదన్నదే ఆ క్లారిటీ. అయితే… దీన్ని అర్థం చేసుకోకుండా బొత్స ప్రకటనలు చేయడంతో… జగన్ కు ఆగ్రహం వచ్చింది. అందుకే.. సీఆర్డీఏ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నట్లుగా.. బొత్స వ్యవహరిస్తున్నారని అంటున్నారు.