ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తొలి రోజు తొలి గంటలోనే పొలిటికల్ గేమ్ పీక్స్‌కి వెళ్లిపోయింది. ప్రశ్నోత్తరాల సమయంలో.. ప్రాజెక్టుల మీద వచ్చిన ఓ ప్రశ్న విషయంలో… అటు సీఎం జగన్మోహన్ రెడ్డి , ఇటు ప్రతిపక్ష నేత కల్పించుకుని పోటాపోటీగా విమర్శలు చేసుకోవడంతో… అసెంబ్లీ సమావేశాల ఓపెనింగ్ అదిరిపోయినట్లయింది. పొరుగు రాష్ట్రం తెలంగాణతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నందున… టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని… కేసీఆర్ ఏపీపై ఔదార్యం చూపిస్తున్నారని… పొరుగు రాష్ట్రం సీఎంతో సన్నిహిత సంబంధాలు అవసరమని.. జగన్ తేల్చి చెప్పారు.
కాళేశ్వరం కడుతున్నప్పుడు.. సీఎంగా చంద్రబాబే ఉన్నారని.. అప్పుడు ఆయన ఎందుకు అడ్డుకోలేదని.. ఆ సమయంలో గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. తాను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కు వెళ్లానని విమర్శిస్తున్నారని.. తాను వెళ్లినా.. వెళ్లకపోయినా… ప్రాజెక్ట్ ప్రారంభించేవారన్నారు. టీఆర్ఎస్తో సన్నిహిత సంబంధాల కోసం… హరికృష్ణ శవం పక్కన పెట్టుకుని.. చంద్రబాబు బేరాలాడారని జగన్ విమర్శించారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం… తెలంగాణతో… నీటి ఒప్పందాలు జరుగుతాయని స్పష్టం చేశారు. కేసీఆర్ గోదావరి నీళ్లు ఇస్తామంటున్నారని.. ఎందుకు కాదనాలని ప్రశ్నించారు. గోదావరి నీటిని… సాగర్, శ్రీశైలంకు తీసుకెళ్లేందుకు ఒప్పందాలు జరుగుతాయని జగన్ తేల్చి చెప్పేశారు. ఎగువ రాష్ట్రం నీళ్లిస్తామంటే… వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షం.. ప్రపంచంలోనే దిక్కుమాలిన ప్రతిపక్షమని జగన్ ఈసడించారు.
అయితే.. చంద్రబాబు.. వ్యక్తిగతంగా.. ఎంతగా విమర్శించినా.. పట్టించుకోను కానీ.. రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం దృష్టిలో పెట్టుకుని… నిర్ణయాలు తీసుకోవాలని.. ప్రభుత్వానికి సూచించారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ప్రాజెక్టులపై.. సంపూర్ణంగా చర్చిద్దామని చెప్పారని.. కచ్చితంగా చర్చిద్దామని.. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇది చాలా సున్నితమైన విషయమని.. భవిష్యత్ తరాల ప్రయోజనాలను తాకట్టుపెట్టేలా వ్యవహరించవద్దన్నారు. ఎవరు రాజకీయం .. వ్యక్తగత ప్రయోజనాల కోసం కాదని… రాష్ట్ర ప్రయోజనాల చేయాలన్నారు. ఈ విషయంపై రెండు పక్షాల మధ్య .. వాదోపవాదాలు పెరుగుతున్న సమయంలో స్పీకర్ జోక్యం చేసుకుని సమయ పాలన పాటిద్దామని చెప్పి… ఇతర ప్రశ్నకు వెళ్లిపోయారు. దీంతో.. తొలి రోజు.. ఓపెనింగే అసెంబ్లీలో మంటలు పుట్టించినట్లయింది.