విజయవాడ ఎంపీ కేశినాని నాని ఇటీవలి కాలంలో రెబల్‌గా మారారు. సోషల్ మీడియాలో పార్టీపైన.. ప్రభుత్వంపైనా విరుచుకుపడుతున్నారు. సొంత పార్టీ నేతలపైనా ఆయన జోరుగా విమర్శలు చేస్తున్నారు. మొన్నా మధ్య దేవినేని ఉమను టార్గెట్ చేశారు. రెండు రోజుల క్రిత.. ” తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం షో మ్యాన్లు అవసరం లేదని, టాస్క్ మాస్టర్లు అవసరం ఉందని” పోస్ట్ పెట్టారు. ఇది ఎవర్ని ఉద్దేశించి అన్నారో.. చాలా మందికి అర్థం కాలేదు కానీ.. తర్వాత.. ఆయన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై గురి పెట్టారు. పదవీకాలం ముగిసిన మాజీ కార్పొరేటర్లతో.. తన కార్యాలయంలో సమావేశం పెట్టి… పశ్చిమ నియోజకవర్గం నుంచి.. వచ్చే ఎన్నికల్లో నాగుల్‌మీరా పోటీ చేస్తారని ప్రకటించారు. తననే టార్గెట్ చేస్తున్నారన్న అభిప్రాయంతో.. వెంకన్న.. తాను తిరగబడితే పరిస్థితులు వేరేలా ఉంటాయని.. హెచ్చరికలు పంపారు.
వెంకన్న, నానిల మధ్య వివాదం పార్టీ అగ్రనేతల వరకు చేరింది. హైకమాండ్, అధినేత చంద్రబాబుకు ఏమీ చెప్పకుండానే, వారి అనుమతి లేకుండానే కార్పొరేటర్ల వద్ద ఎంపీ కేశినేని నాని పశ్చిమ నియోజకవర్గంలో నాగుల్ మీరా పోటీ చేస్తారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పుడో జరగబోయే ఎన్నికల గురించి ఇప్పుడెందుకు ప్రస్తావించడం ఏమిటనేది చాలా మందికి అర్థం కావడం లేదు. ఈ వివాదం.. చంద్రబాబు దృష్టికి వెళ్లింది. నాని.. బుద్దా వెంకన్నను టార్గెట్ చేశారనేది మాత్రం నిజమంటున్నారు.
బుద్దా వెంకన్న.. చంద్రబాబుకు విధేయుడు. గతంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ.. పార్టీలో చేరికల కారణంగా.. తన సీటును వదులుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. అలా వదులుకుని పార్టీ అభ్యర్థుల కోసం పని చేశారు కూడా. అయితే.. తన నియోజకవర్గంలో.. తన ప్రమేయం లేకుండా.. చేయడానికి… కేశినేని నాని ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం… బుద్దా వెంకన్నలో వ్యక్తమవుతోందంటున్నారు. పార్టీ పరాజయం తర్వాత.. ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం.. ఇప్పుడే గొడవపడటం … టీడీపీలోని ఇతర నేతలకు… విస్మయాన్ని కలిగిస్తోంది.