చిన్న సినిమాలకు సరైన సపోర్ట్ లేకపోతే ఫలితం అంత బాగా వుండదు. ఈవారం విడుదలైన రాజ్ దూత్ సినిమానే అందుకు ఉదాహరణ. ఈవారం సందీప్ కిషన్ ‘నిను వీడని నీడను నేనే’, ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’, మేఘాంశ్ శ్రీహరి ‘రాజ్ దూత్’ విడుదలయ్యాయి. సందీప్, ఆనంద్ దేవరకొండ సినిమాలకు ఓ ప్లాన్డ్ గా సోషల్ మీడియాలో ప్రచారం సాగించారు. అదే విధంగా సినిమా సెలబ్రిటీలతో బాగానే బైట్ లు, లాంచింగ్ లు చేసి ప్రచారాన్ని ఓ కొలిక్కి తెచ్చారు.
ఈ తేడా శుక్రవారం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో రాజ్ దూత్ కు మినిమమ్ ఓపెనింగ్స్ రాలేదు. శ్రీహరి కొడుకుగా తొలిసినిమాను సింపుల్ గా తీసుకుని, అంతకన్నా సింపుల్ గా వదిలేయడం అన్నది కాస్త మైనస్ అనుకోవాలి.
దొరసానికి రీజనబుల్ ఓపెనింగ్స్ వచ్చాయి. నిను వీడను నేనే సినిమాకు మరీ అద్భుతం కాకపోయినా, ఓ మాదిరిగా మంచి ఓపెనింగ్స్ నే దక్కాయి. దొరసాని ఓపెనింగ్స్ లో మార్నింగ్ షో కి తరువాత షోలకు కాస్త తేడా వుంది. నిను వీడని నీడను నేనే విషయంలో కాస్త రిలీఫ్ వుంది.