ఇస్మార్ట్ శంకర్ సినిమాను ఆంధ్ర ఏరియాకు అభిషేక్ పిక్చర్స్ తీసుకుంది. ఆరు కోట్ల రేషియోలో ఇస్మార్ట్ శంకర్ ను ఆంధ్రలోని గుంటూరు మినహా మిగిలిన ఏరియాలకు అభిషేక్ పిక్చర్స్ తీసుకుంది. అభిషేక్ పిక్చర్స్ మొత్తం ఫస్ట్ కాపీనే తీసుకోవాలని ప్రయత్నించింది. అయితే రేటు దగ్గర తేడా వచ్చి కుదరలేదు. ఈలోగా నైజాం, సీడెడ్, గుంటూరు ఏరియాలు విక్రయించేసారు.
దీంతో ఆంధ్రలోని మిగిలిన ఏరియాలు అన్నీ కలిపి అభిషేక్ పిక్చర్స్ తీసుకుంది. ఆ విధంగా ఆంధ్ర మొత్తం మీద ఇస్మార్ట్ శంకర్ కు ఆరు నుంచి ఆరున్నర కోట్లు వచ్చాయి. నైజాం, సీడెడ్ కలిపి ఆరున్నర కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ 13 కోట్లు వచ్చినట్లు అయింది.
ఓవర్ సీస్ ఓన్ రిలీజ్. నాన్ థియేటర్ రైట్స్ 12 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పాతిక కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు అయింది. ఈ సినిమా ఈనెల 18న విడుదలవుతోంది.