ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్లిన టీమిండియా.. సెమీస్‌లో.. కవీస్‌పై ప్రతాపం చూపలేక.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. టీమిండియా విజయంపై .. ఒక్క శాతం కూడా అనుమానం లేని.. భారత అభిమానులకు.. ఇది నిజంగా షాక్. కానీ.. ఈ ఓటమి వెనుక.. ఎన్నెన్ని పొరపాట్లు ఉన్నాయో.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అందులో అందరికీ షాకింగ్‌కు గురి చేసే అంశం… జట్టు మొత్తం ఏకతాటిపైకి లేకపోవడం. రెండు గ్రూపులుగా విడిపోవడం. ఒక గ్రూపుపై..మరో గ్రూపు ఆధిపత్యానికి ప్రయత్నించడం. ఆ రెండు గ్రూపుల్లో ఒక దానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తూండగా.. మరో దానికి వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నట్లు.. జాతీయ మీడియా ప్రకటిస్తోంది.
టీమిండియాలో రెండు గ్రూపులు ..!
టీమిండియా సెలక్షన్ ప్రక్రియ మొదటి నుంచి వివాదాస్పదమవుతోంది. టోర్నీకి వెళ్లే జట్టును ప్రకటించినప్పుడు… అంబటి రాయుడు, రిషబ్ పంత్ లాంటి వాళ్లను కాకుండా.. విజయ్ శంకర్, దినేష్ కార్తీక్ లాంటి వాళ్లను ఎంపిక చేయడంతో.. చాలా మంది ఆశ్చర్యపోయారు. తర్వాత అది విమర్శల రూపంలో కనిపించింది. ఆ తర్వాత తుది జట్టు ఎంపికలోనూ.. అదే పరిస్థితి కనిపించింది. శిఖర్ ధావన్ గాయంతో.. వైదొలగడంతో.. జట్టు కూర్పు పూర్తిగా దెబ్బతింది. కేఎల్ రాహుల్.. వరుసగా విఫలమైనా.. అవకాశాలు కల్పించడం.. కూడా చర్చకు దారి తీసింది. ఓ మ్యాచ్‌లో రాహుల్ సెంచరీ కొట్టినప్పటికీ.. కీలకమైన మ్యాచుల్లో… చేతులెత్తేశారు. కేవలం.. కోహ్లీ మద్దతు ఉండటం వల్లే.. ఓపెనర్‌గా.. చివరి దాకా రాహుల్ ఉన్నారన్న అభిప్రాయాలున్నాయి.
కోహ్లీకి ఎవరు నచ్చితే టీమ్‌లోవాళ్లే ..!?
టీంలో… రోహిత్ శర్మ, బుమ్రాల్లాంటి స్టార్ ప్లేయర్లు మినహా… ఇంక ఎవరు జట్టులోకి రావాలన్నా.. కచ్చితంగా.. కోహ్లీ మద్దతు ఉండాల్సిందేనన్న చర్చ జరుగుతోంది. కోహ్లీకి నచ్చకపోతే.. షమీకి సెమీస్‌లో చోటు దక్కనట్లుగానే పరిస్థితులు ఉంటాయని.. జాతీయ మీడియా చెబుతోంది. దినేష్ కార్తీక్ ట్రాక్ రికార్డు.. ఏ స్థాయిలోనూ బాగోలేదు. ఆయనది ప్రపంచకప్ స్థాయి ఆట కాదు. ఆ విషయం ఎన్నో సార్లు రుజువయింది. అయినప్పటికీ.. ఆయనకు అవకాశాలొచ్చాయి. అలాగే విజయ్ శంకర్ ఏ మాత్రం తనను తాను ప్రూవ్ చేసుకోకుండానే… జట్టులోకి వచ్చాడు. ఆయన ఆటతీరు చూసి షాకయి.. గాయం కాకపోయినా.. గాయం అయిందని చెప్పి.. పంపేశారనే ప్రచారం కూడా ఉంది. చివరికి అంబటి రాయుడ్ని తీసుకోవాలనుకున్నా.. కోహ్లీ ఇష్టపడలేదని.. అందుకే మాయాంక్ అగర్వాల్‌ను పిలిపించారని చెబుతున్నారు.
సెమీస్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో వాగ్వాదం..!
అందుకే.. సెమీస్‌లో ఓటమి తర్వాత… డ్రెస్సింగ్ రూమ్‌లో.. రెండు వర్గాల మధ్య వాగ్వాదం నడిచిందనే ప్రచారం జరుగుతోంది. ప్రతిభావంతులకు అవకాశం కల్పించకుండా.. కేవలం.. కోహ్లీ తనకు నచ్చిన వారికి మాత్రమే అవకాశాలు కల్పించారని.. రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అదే సమయంలో… కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తీరుపై కూడా ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నారు. తుది జట్టు ఎంపికలోనూ.. వారి జోక్యం చేసుకుని.. పరిస్థితుల్ని క్లిష్టం చేశారు. ఈ టీమిండియా విబేధాల సంగతేమో కానీ.. బీసీసీఐ పాలనా కమిటీ మాత్రం… ఇదే అంశాలపై… టీమిండియా కెప్టెన్, కోచ్‌లపై ప్రశ్నల వర్షం కురిపించడానికి రెడీ అయిపోయింది.
అంతా కోహ్లీనే చేశాడా..?
విరాట్ కోహ్లీ ఇలా.. యాటిట్యూడ్‌తో వ్యవహరించడం వల్లే.. గతంలో.. కుంబ్లే తన కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నుంచి కోహ్లీ చెప్పిందే వేదమైంది. అదే.. టీమిండియా ఓటమికి కూడా కారణం అయిందనే ప్రచారం జరుగుతోంది.