అమరావతి ఆలయానికి సంబంధించి చెన్నైలో ఉన్న అత్యంత విలువైన భూముల విషయంలో ఏపీ సర్కార్.. ఏం చేయబోతోందో.. అసెంబ్లీలో క్లారిటీ ఇవ్వలేకపోయారు. అయితే.. గతంలో జరిగిన టెండర్లపై మాత్రం విజిలెన్స్ దర్యాప్తు చేయిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో.. వైసీపీ అత్యంత వివాదాస్పదం చేసిన నిర్ణయాల్లో సదావర్తి సత్రం భూముల అమ్మకం వ్యవహారం ఒకటి. సదావర్తి సత్రానికి చెన్నై శివార్లలలో భూములున్నాయి. అయితే.. దానికి లెక్కా పత్రం లేదు. ఆ భూములపై యాజమాన్య హక్కుల వివాదాలు కూడా ఉన్నాయి. ఆ భూములు తమవని కూడా.. తమిళనాడు సర్కార్ వాదిస్తోంది.
అప్పట్లో… ఏపీ సర్కార్.. అసలు ఆ భూవివాదం… యాజమాన్య హక్కుల వివాదాలు… కోర్టులు, కేసులతో సంబంధం లేకుండా.,. వాటితో సహా భూములను కొనుగోలు చేయడానికి.. వేలం నిర్వహించింది. అయితే.. అసలు కోర్టులో తేలుతుందో లేదో తెలియదు… ఎన్నాళ్లకు తేలుతుందో కూడా తెలియదు… అలాంటి భూముల్ని కొంత మంది కలిసి పాడుకున్నారు. అలా పాడుకున్న వారిలో.. అప్పట్లో కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న రామానుజయ కూడా ఉన్నారు. దాంతో.. వైసీపీ వివాదం ప్రారంభించింది. సదావర్తి భూముల విలువ రూ. ఐదు వేల కోట్లని… వాటిని రూ. 20 కోట్లకే బినామీలకు అమ్మేశారని ఆరోపణలు గుప్పించారు.
వైసీపీ హయాంలో.. పిటిషన్లు వేయడానికే.. పూర్తి సమయం కేటాయించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీనిపై కూడా పిటిషన్ వేశారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. ఐదు కోట్లు ఎక్కువ కట్టి వాటిని తీసుకోవాలని సూచించింది. కానీ కట్టలేకపోయారు. ఈ క్రమంలో న్యాయపోరాటం ద్వారా రెండో సారి కూడా వేలం వేయించారు. ఆ వేలం పాటలో ఆయన కూడా పాల్గొన్నారు. రూ. ఐదు వేల కోట్లని ప్రచారం చేసిన వైసీపీ, ఆళ్ల రామకృష్ణారెడ్డి తమ వేలాన్ని.. కనీసం పాతిక కోట్లకు కూడా తీసుకోలేదు. మధ్యలోనే ఆపేశారు. అయితే.. విజయవంతంగా.. ఆ భూముల క్రయవిక్రయాలు జరగకుండా.. నిలిపివేయగలిగారు. ఈ హడావుడి చూసిన.. తమిళనాడు సర్కార్.. ఆ భూములు తమవేనని.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో.. వివాదం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అమరావతి ఆలయానికి రావాల్సిన ఆ కొన్ని కోట్ల రూపాయలు కూడా.. ఆగిపోయాయి.
ఇప్పుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చింది… ఆ ఆలయ భూములన్నింటి మీద రూ. ఐదు వేల కోట్లు సంపాదించి చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా గుర్తు చేసిన వైసీపీ… టీడీపీ హయాంలో జరిగిన నిర్ణయాలపై ఆరోపణలు చేసింది. వేలంపై .. విజిలెన్స్ దర్యాప్తు చేస్తామని ప్రకటించారు. అయితే భూములను… రూ. ఐదు వేల కోట్లకు అమ్మి చూపిస్తే… గత సర్కార్ హయాంలో భారీగా అవినీతి జరిగిందన్న అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది. ఆరోపణలకే పరిమితమైతే మాత్రం ఇబ్బందే..!