కేంద్రప్రభుత్వం కొత్తగా మరో ఆరు రాష్ట్రాల గవర్నర్లను మార్చింది. కొంత మందిని వేరే రాష్ట్రాలకు బదిలీ చేస్తే.. మరికొంత మందినితొలగించి కొత్త వారిని నియమించారు. యూపీ గవర్నర్గా ఆనందీబెన్ పటేల్, పశ్చిమ బెంగాల్ గవర్నర్గా జగదీప్ ధవ్కర్, త్రిపుర గవర్నర్గా రమేష్ బయాస్, మధ్యప్రదేశ్ గవర్నర్గా లాల్జీ టాండన్, బిహార్ గవర్నర్గా ఫాగు చౌహాన్, నాగాలాండ్ గవర్నర్గా ఆర్ఎన్ రవిని నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. వారు ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తే..అప్పట్నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ తెలిపింది. కొద్ది రోజుల క్రితం… ఆంధ్రప్రదేశ్,చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమించారు. ఇప్పుడు మరో రాష్ట్రాలకు నియమించారు.
ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరించిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను ప్రస్తుతం..తెలంగాణకే పరిమితం చేశారు. ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ అనే ఒడిషా నేతను గవర్నర్ గా నియమించారు. ఆయన మరో మూడు రోజుల్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పుడు.. తెలంగాణ నుంచి కూడా గవర్నర్ గా నరసింహన్ ను తప్పిస్తారనే ప్రచారం జరిగింది. గవర్నర్ గా.. పన్నెండేళ్ల పాటు నరసింహన్ కొనసాగడంతో … కేంద్రం ఆయనను తప్పిస్తుందని ప్రచారం జరిగింది. ఆయనను జమ్మూకశ్మీర్ గవర్నర్ కు సలహాదారుగా నియమిస్తారని కూడా చెప్పుకున్నారు. కానీ… గవర్నర్ల నియామకాలు వరుసగా అయిపోతున్నాయి కానీ.. తెలంగాణకు మాత్రం.. నరసింహన్ పేరే కొనసాగుతోంది.
కాంగ్రెస్ హయాంలో నియమితులైన గవర్నర్ నరసింహన్ కు.. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా… రాజకీయచాణక్యం ఎక్కువే ఉందని..తెలుగు రాష్ట్రాల నేతలు చెబుతూ ఉంటారు. కాంగ్రెస్ హయాంలో గవర్నర్ గా నియమితులైన ఆయన… బీజేపీ హయాంలోనూ నిర్విఘ్నంగా కొనసాగారు. ఆయన కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే.. ఆ ప్రభుత్వం ఉన్న పార్టీ రాజకీయ అవసరాలకు తగ్గట్లుగా …వ్యవహరిస్తారని..చెబుతూంటారు. అదీ కాకుండా.. కేంద్ర ప్రభుత్వంలో కమాండింగ్ పొజిషన్ లో ఉ్నన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కు.. నరసింహన్ అత్యంత సన్నిహితుడు. ఆయన సిఫార్సును..మోడీ కూడా కాదనలేరని చెబుతూ ఉంటారు. బహుశా నరసింహన్.. ఆ దిశగా ప్రయత్నాలు చేసి ఉంటారని అంటున్నారు. అయితే నరసింహన్ ను కొనసాగించాని.. తెలంగాణ బీజేపీ నేతలు కూడా కోరుకోవడం లేదు. మరి కేంద్రం ఏం చేస్తుందో..?