సొంత సినిమాలు హిట్ కాక.. ప్రకటించిన సినిమాలకు ఫైనాన్స్ దొరక్క.. ఖాళీగా ఉండి… పూరి జగన్నాథ్ సినిమాకు ప్రమోషన్ వర్క్ చేస్తున్న రామ్గోపాల్ వర్మ అలియాస్ అర్జీవీ ఓవరాక్షన్ చేసి.. తెలంగాణ పోలీసులను కెలుక్కున్నారు. వాళ్లపై అవసరంగా సోషల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్లు చేసి.. కించ పరిచారు. అంతటితో ఊరుకోలేదు.. నేను ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించాను.. పోలీసులు ఏం పీకలేకపోయారన్నట్లుగా… కామెంట్లు, ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి మరింత రచ్చ చేశారు. దీంతో పోలీసులు ఆర్జీవీపై ఆగ్రహం ఉన్నట్లుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
శిష్యుడు పూరి జగన్నాథ్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కు.. ప్రచారం కల్పించేందుకు ఆర్జీవీ..రిలీజ్ కు ముందు నుంచీ ప్రయత్నిస్తున్నారు. సినిమా రిలీజైన తర్వాత ఈ స్కిట్లు కొనసాగిస్తున్నారు. ఈ రోజు.. మూసాపేట లో ధియేటర్ కు మాస్ గెటప్ లో వెళ్తానని ముందుగానే ప్రకటించారు. అన్నట్లుగానే వెళ్లారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించిన అగస్త్య, ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో కలిసి.. రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ పై వెళ్లారు. ఎవరూ హెల్మెట్ పెట్టుకోలేదు. పైగా ట్రిపుల్ రైడింగ్. మేమిలా వెళ్తున్నాం.. అయినా ఒక్క పోలీసు కూడా లేరు. అసలు పోలీసులు ఎక్కడున్నారు..? బహుశా పోలీస్ స్టేషన్లో ఉన్నారేమో అంటూ సెటైర్లు వేశారు. వెంటనే అలర్టయిన పోలీసులు బండి నెంబర్ ఆధారంగా చలాన్ విధించారు. కానీ ఆర్జీవీని అంతటితో వదిలి పెట్టకూడదని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
పోలీసుల ఇమేజ్ కు.. భంగం కలిగేలా.. ఆర్జీవీ వ్యవహరించడంతో.. ఉన్నతాధికారులు కూడా.. ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సినిమా ప్రమోషన్ కోసం.. పోలీసుల్ని కించపర్చడం.. కావాలనే చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలడంతో.. తదుపరి ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై.. కింది స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారంటున్నారు. ఇప్పటికే ఆర్జీవీపై… జీఎస్టీ అనే సినిమా కేసు ఉంది. ఆ సినిమా పూర్తిగా ఎక్స్ రేటెడ్ సినిమా. దాన్ని హైదరాబాద్ లో చిత్రీకరించారనే ఫిర్యాదు ఉంది. అప్పట్లో వరుసగా రెండు, మూడు రోజుల పాటు ప్రశ్నించారు కూడా.కానీ తర్వాత సైలెంటయ్యారు. ఇప్పుడు.. ఆ కేసు బయటకు తీసి.. తామేంటో పోలీసులు ఆర్జీవీకి చూపిస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.