సినిమా హిట్ అయ్యింది. యాబైకోట్లు వసుళ్ళూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా దర్శకుడికి ఆఫర్ లేదు. ఆ దర్శకుడి పేరు అశోక్. సినిమా పేరు భాగమతి. బాహుబలి తర్వాత అనుష్క నుండి వచ్చిన ఈ సినిమా అదరగొట్టింది. అరుంధతి తర్వాత అనుష్క సోలోగా సత్తా చాటిన సినిమాగా పేరు తెచ్చుకుంది. స్వయంగా నిర్మాతలలే ”మా సినిమా యాబైకోట్లు తెచ్చిందని” ప్రకటించారు. యాబైకోట్లు తెచ్చిన సినిమా దర్శకుడు అంటే ఎలా ఉండాలి? కానీ ఇప్పుడు అశోక్ కి మరో సినిమా లేకుండాపోయింది.
అశోక్ దగ్గర చాలా కధలు వున్నాయి. వినడానికే ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికి కారణాలు ఏమిటంటే .. భాగమతి క్రెడిట్ చాలా వరకూ అనుష్క ఖాతాలో పడింది. మిగతాది తమన్, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తీసుకున్నారు. అశోక్ గురించి పెద్దగా చెప్పుకోలేదు. పైగా అది లేడీ ఒరియంటెడ్ సినిమా. దీంతో హీరోల ద్రుష్టి అశోక్ పై పడలేదు. ప్రస్తుతం అశోక్.. ఫుల్ ఫామ్ లో వున్న ఓ కుర్ర హీరో కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన డేట్స్ లేవు. ”చెద్దాం ”అంటున్నాడు కానీ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. సో.. అశోక్ కి కొన్నాళ్లు వెయింటింగ్ తప్పదన్నమాట.