శ్రీనివాస్ సాయి, భావనరావు జంటగా అజయ్ సాయి మనికందన్ దర్శకత్వంలో కాశీ ప్రొడక్షన్స్ పతాకంపై దివ్యా ప్రసాద్, అశోక్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘మథనం’. ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. ముఖ్య అతిథిగా దర్శకుడు సురేందర్‌రెడ్డి హాజరయ్యారు. లవ్ స్టోరీని కాస్త డిఫరెంట్‌గా తెరకెక్కించారు ఈ మూవీలో. అన్నంతినకుండా మారాం చేస్తున్న పిల్లవాణ్ని తల్లిదండ్రులు బుజ్జగించే సీన్‌తో ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది.
‘‘నాపేరు రామ్, నేను 14 సంవత్సరాలు ఈ చీకటి గదిలో ఉండిపోయాను. నేను బయటకి రావడానికి కారణం ప్రేమ. ఆలోచించడానికి అందంగా ఉంటుంది. దక్కించుకోవడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది’’ అంటూ హీరో చెప్పే డైలాగ్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. తర్వాత హీరోయిన్ చెప్పే డైలాగ్ కూడా టీజర్లో హైలెట్‌గా నిలిచింది.
‘‘నీ సిన్సియారిటీ నాకు బాగా నచ్చింది. బట్ యూ నో ఫస్ట్ నా స్టడీస్’’ అంటూ హీరోయిన్ ఇచ్చే రిప్లై కూడా ఆసక్తికరంగా ఉంది. ‘‘ముందు వాన్ని వాడికి పరిచయం చేయండి, లేదంటే మీ కొడుకు మీకు దక్కకుండా పోతాడు’’ అంటూ టీజర్ చివరలో అజయ్ చెప్పే డైలాగ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. మొత్తానికి టీజర్ ఈ సినిమాపై ఆసక్తి పెంచేలా చేస్తుంది.
హీరో హీరోయిన్ల యాక్టింగ్, ఫొటోగ్రఫీ టీజర్లో హైలెట్. రాజీవ్ కనకాల, సితార తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు. టీజర్‌ను బట్టీ ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. రామ్ అనే యువకుడి కథ ఇది. లవ్ జర్నీలో అతని మథనం ఏమిటన్నదే ఈ మూవీ కథాంశం.