వైవిధ్యమైన చిత్రాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ వేసుకున్న హీరో వరుణ్ తేజ్. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వరణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘వాల్మీకి’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఇక తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్స్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది.
ఇటీవల విడుదలైన ప్రీ లుక్ టీజర్ చూసిన తర్వాత మూవీపై అందరికీ ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. అందుకు సంబంధించి వరుణ్ తేజ్ తన ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చేశారు. వరుణ్ మాస్ లుక్‌తో ఉన్న పోస్టర్‌లో రిలీజ్ డేట్ ఇచ్చారు.
వాల్మీకిని సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ కూడా భిన్నంగా చేపట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రం తమిళనాట హిట్ అయిన జిగర్తాండ సినిమాకు రీమేక్. వరుణ్ తేజ్ లుక్ మాత్రం అదిరిపోయింది. దీంతో ప్రేక్షకులకు మూవీపై కూడా హోప్స్ పెరిగాయి. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె.మేయర్ అందిస్తున్నారు.