ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతను.. మోడీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం లైట్ తీసుకోలేదు. పరాజయం పాలైనప్పటికి.. చంద్రబాబుకు ప్రస్తుతం ఉన్న భద్రతను తగ్గించడం.. మంచిది కాదని కేంద్రం అనుకుంది. ఈ మేరకు.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన వీఐపీల భద్రత సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. మాజీలైనప్పటికీ చంద్రబాబు నాయుడు, ఫరూక్ అబ్దుల్లాలకు ముప్పు ఉందని.. గుర్తించి.. ఆ మేరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌తో రక్షణ కొనసాగించనున్నారు. అదే సమయంలో పలువురు నేతలకు.. భద్రతను తగ్గించడమో.. తొలగించడమో చేశారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు.. జడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించారు.
దేశంలో కేవలం పన్నెండు మందికి మాత్రమే ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ కల్పిస్తుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా.. భద్రతా సమీక్ష కమిటీ.. దీనిపై.. నిర్ణయం తీసుకుంటుంది. ఆ మేరకు.. ఈ మోడీ రెండో సారి ప్రధాని అయిన తర్వాత తొలిసారి సమావేశం జరిగింది. ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న వారికి.. కేంద్ర బలగాలతో పాటు.. రాష్ట్ర బలగాలు కూడా.. ఆ స్థాయికి తగ్గట్లుగా రక్షణ కల్పించాలి. కానీ.. చంద్రబాబు.. ఓడిపోయిన తర్వాత.. ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ సర్కార్… చంద్రబాబు భద్రతను నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వచ్చాయి. ట్రాఫిక్ క్లియరెన్స్ పైలెట్‌ను తొలగించారు. టూ ప్లస్ టూ మాత్రమే సెక్యూరిటీని కొనసాగిస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఆందోళన చెంది.. హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు.
ప్రస్తుతం.. చంద్రబాబు భద్రతకు సంబంధించిన పిటిషన్ హైకోర్టు విచారణలో ఉంది. మాజీ సీఎం భద్రత అత్యంత సున్నితమైన విషయం కాబట్టి… బహిరంగ కోర్టులో విచారణ వద్దని.. ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వాదించడంతో.. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు చేపట్టింది. దీనికి సంబంధించిన వివరాలేమీ బయటకు రావడం లేదు. కానీ… పోలీసులు మాత్రం.. చంద్రబాబు… జడ్ ప్లస్ కు తగ్గట్లుగానే… భద్రత కల్పిస్తున్నామని.. మొదట్లో కోర్టుకు చెప్పారు.