విజయ్ దేవరకొండ బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. తనతో సినిమాలు చేయడానికి దర్శకులు, నిర్మాతలు ఎగబడుతున్నారు. విజయ్ సినిమా అంటే విడుదలకు ముందు బిజినెస్ పూర్తయిపోతోంది. ఇలాంటి దశలో విజయ్ సినిమాకి అవాంతరాలు రావడం ఆశ్చర్యమే. విజయ్ కొత్త సినిమా `హీరో`కి అనుకోకుండా బ్రేక్ పడిందని టాక్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రమిది. ఆనంద్ అన్నామలై దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ మొదలై, ప్రస్తుతం ఆగిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన ఓ బైక్ ఛేజ్‌ని అత్యంత భారీగా తెరకెక్కించార్ట. ఈ బైక్ ఛేజ్ కోసం 2 కోట్ల వరకూ ఖర్చు పెట్టారని తెలుస్తోంది. తీరా అవుట్ పుట్ చూశాక నిర్మాతలు పెదవి విరిచారని, అంతే కాకుండా ఇప్పుడు స్క్రిప్టులోనూ మార్పులు చేర్పులు చేయమంటున్నారని టాక్. ఇవన్నీ పూర్తయి.. స్క్రిప్టుపై నమ్మకం కుదిరాకే ఈ సినిమాని పట్టాలెక్కించాలని భావిస్తున్నార్ట. ఈ సినిమా ఆగిపోవడం వల్ల విజయ్‌కి పెద్దగా నష్టమేం లేదు. ఈలోగా క్రాంతి మాధవ్ సినిమాని పూర్తి చేసుకుంటాడు. కాకపోతే.. నిర్మాతలకే ఖర్చు కనపడుతుంది. మరి `హీరో`ఈ అవాంతరాలన్నీ దాటుకుని ఎప్పుడు బయటకు వస్తాడో?
https://www.youtube.com/watch?v=MbyOwTRgsoU