బిగ్ బాస్ 3 సీజన్ స్టార్టింగ్‌లోనే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. 15 మంది కంటెస్టెంట్స్‌తో వంద రోజులపాటు సాగే ఈ షోలో మూడు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. కానీ అప్పుడే హౌస్‌లో రచ్చ మొదలైంది. మొదట ఆరుగురు సభ్యులు నామినేషన్లోకి వెళ్లారు. తర్వాత వారికి రీప్లేస్ చేసుకునే అవకాశం బిగ్ బాస్ కల్పించాడు. అలా మరికొందరు నామినేట్ అయ్యారు. రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమ నామినేట్ అయ్యారు. మొత్తానికి వీరిలో ఈ వారం ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది.
అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి మరో అందాల ముద్దుగుమ్మ ఎంట్రీ అవుతుందని టాక్. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంట్లోకి టాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాదాస్ అడుగుపెట్టనుందట. హౌస్‌లో గ్లామర్‌ను కాస్త ఎక్కువగా చూపించాలనుకుంటుందేమో బిగ్ బాస్ టీమ్ అందుకే ఈమెకు అవకాశం ఇవ్వనున్నట్లున్నారు.
తన అందచందాలతో ప్రేక్షకుల మదిని దోచిన ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టనుంది. శ్రద్దాదాస్ కంటే ముందు హెబ్బా పటేల్ ని హౌస్‌లోకి తీసుకురావాలనుకున్నారు షో నిర్వాహకులు. అయితే ఆమె కొన్ని కారణాల వల్ల తిరస్కరించడంతో శ్రద్ధాదాస్‌ని ఆశ్రయించారట. శ్రద్ధ ఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ హౌస్‌కు కూడా మరింత గ్లామర్ వస్తుంది.