హీరో రానా ఆరోగ్యంపై జోరుగా వార్తలు వస్తున్నాయి. రానా కిడ్నీల సమస్యతో బాధపడుతున్నాడనేది ఈ వార్తల సారాంశం. చాన్నాళ్లు మందుల మీద నెట్టుకువచ్చాడని, అయితే కిడ్నీల మార్పిడి తప్పనిసరైయిందని, అందుకే ఇప్పుడు అమెరికా వెళ్లాడని, అక్కడ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేస్తారని, దగ్గుబాటి కుటుంబసభ్యులంతా అమెరికాలో వున్నారని.. వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు రానా స్పందించలేదు.
కాగా సర్జరీ విషయాన్ని ఓ నెటిజన్ ఇన్స్టాగ్రామ్ లో రానాని అడిగాడు. దీనికి రానా రిప్లై ఇచ్చాడు . ‘ఆ వార్తల్ని చదవకండి’ అంటూ రాసుకొచ్చాడు. మరో నెటిజన్.. ‘మరి మీరు బరువు ఎందుకు తగ్గిపోయారు?’ అని ప్రశ్నించగా.. ‘ఎప్పుడూ రాక్షసుడిలా ఉండలేను’ సమాధానం ఇచ్చాడు. రానా సమాధానాలు బావున్నాయి కానీ అసలు సర్జరీ జరిగిందా లేదా ? సమస్య ఉందా లేదా ? అనే విషయాలని మాత్రం చెప్పలేదు. ఈ విషయంలో స్పష్టత రావాలంటే కుటుంబ సభ్యుల నుండి ఎవరో ఒకరు బయటికి వచ్చి మీడియా ముఖంగా ఓ ప్రకటన చేస్తే గానీ ఈ వార్తలకు తెరపడదని చెప్పాలి.