తమిళచిత్ర సీమ అంటే తనకు ఎంతో అభిమానమని, తాను వెండితెరకు పరిచయమైంది కోలీవుడ్‌లోనేనని హీరోయిన్ ఐశ్వర్యారాయ్ అన్నారు. తన సినీ ప్రయాణం మొదలైంది ఇక్కడేనని, తనకు గౌరవం తెచ్చిన తమిళ నేలకు రుణపడి ఉన్నానంది. తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, ఇక్కడున్న మహోన్నతమైన వ్యక్తుల తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్నారు. తాజాగా చెన్నైలోని ఓ మాల్ ప్రమోషన్‌కు వెళ్లిన ఆమె మీడియాతో మాట్లాడారు. చెన్నై వాతావరణం, ఆహారపు అలవాట్లు, ప్రేమ, ఆప్యాయతలను తాను జీవితాంతం గుర్తుంచుకుంటానన్నారు.
ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తమిళ ప్రతిష్టాత్మక నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తోంది. పీరియాడికల్ వార్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుంది. చోళ సామ్రాజ్యం నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 10వ శతాబ్ధానికి చెందిన కథతో మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమాలో రాజ్యాధికారం కోసం కుట్రలు చేసే నందిని అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. విక్రమ్, శింబు, జయం రవిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అమలాపాల్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ మూవీ రూ.1000 కోట్ల బడ్జెట్ తో రూపొందనుందని తెలుస్తోంది.