బిగ్ బాస్ 3 రసవత్తరంగా సాగుతోంది. నాలుగో ఎపిసోడ్‌కే జనాలంతా షోపై చర్చ సాగించేలా సీన్స్ ఉంటున్నాయి. ఎక్కువగా గొడవకే ప్రాధాన్యం ఇస్తూ షో సాగుతోంది. బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ ఇప్పటికే మూడు రోజులను పూర్తి చేసుకున్నారు.
మూడో రోజు ఉదయమే టీ విషయంలో గొడవ స్టార్ట్ అయింది. టీలో సరిగ్గా చక్కెర లేదంటూ, ఇందులో పాలున్నాయా లేకపోతే నీళ్ల టీ తాగుతున్నామా అంటూ కంప్లైంట్స్ రావడంతో సీరియస్ అయ్యింది హేమ. కాగా తాను ఉన్నన్ని రోజులు తానే వంట చేస్తానంటూ, మీకు నచ్చకపోతే చెప్పండంటూ హేమ పేర్కొన్నారు.
ఇక బిగ్ బాస్ శివజ్యోతిని ద్వారా సభ్యులంతా చిన్నపిల్లల్లాగా మారే టాస్క్ చేయమని ఆదేశించాడు. కేర్ టేకర్స్‌గా పునర్నవి, వరుణ్ సందేశ్ నియమించాడు బిగ్ బాస్. మిగతా సభ్యులంతా చిన్నపిల్లల్ల మాదిరిగా గడపాలని సూచించాడు. సభ్యులంతా ఆ టాస్క్‌లో ఇన్వాల్వ్ అయ్యారు.
చిన్నపిల్లలుగా లిమిట్స్ దాటి ప్రవర్తించిన సభ్యుల్ని వరుణ్, పునర్నవి కంట్రోల్ చేయలేకపోయారు.
ఈ టాస్క్ చేస్తున్న సమయంలో మహేశ్ విట్టా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. తనకు ఓవర్ యాక్షన్ చేయడం ఇష్టం ఉండదని, సైలెంట్‌గా ఉంటానంటూ టాస్క్‌లో ఇన్వాల్ కాలేదు. ఇక రవికృష్ణ, రోహిణి మాటల మధ్యలో మహేశ్‌ను ఉద్దేశించి ‘కర్రిగాడు’ అంటూ హేళన చేశారు. రవి, మహేశ్‌ను కర్రోడు అనడంతో అతనికి కోపం వచ్చింది. మహేశ్ దీనిపై కాస్త ఘాటుగానే స్పందించాడు. తర్వాత ఈ విషయాన్ని పునర్నవి చెప్పాడు మహేశ్.
ఫుడ్ విషయంపై శ్రీముఖి, అలీ రాజా మధ్య కాసేపు సంభాషన నడిచింది. మధ్యలో హేమ వచ్చి వాళ్లను ఎందుకు అడుగుతున్నావు అన్నారు. కిచెన్ విషయంలో ఎందుకు తలదూర్చుతారంటూ హేమ కోప్పడింది. దీంతో రాహుల్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ అంతెత్తున్న హేమపైకి లేచాడు. హౌస్‌లో ఉన్న అందరికీ ఫుడ్ విషయంలో సంబంధం ఉంటుంది. మీ ఇష్టం అంటే కుదరదు అంటూ హేమతో గట్టిగా వాదించాడు. కాసేపు భావోద్వేగానికీ లోనయ్యాడు. హౌస్ మొత్తం హడలిపోయింది.
మొత్తానికి బిగ్ బాస్ 3లో నాలుగో ఎపిసోడ్ మొత్తం గొడవలతోనే సాగిపోయింది. నెస్ట్ ఎపిసోడ్ కూడా గొడవలతోనే కొనసాగునున్నట్లుగా అనిపిస్తోంది. చపాతి ముక్క ఎవరు తిన్నారనే విషయంపై రచ్చ కొనసాగేలా ఉంది. ఎంటర్టైన్ మెంట్, గ్లామర్ ఒలకబోతలు ఫుల్‌గా ఉండే బిగ్‌బాస్ హౌస్‌లో ఈసారి అవి కొరవడినట్లుగా అనిపిస్తోంది. చూద్దాం వచ్చే ఎడిసోడ్స్లోనైనా వాటిని కవర్ చేస్తారేమో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
https://www.youtube.com/watch?v=Fr_3ei8xUK4