మౌలిక సదుపాయాల నిర్మాణ రంగంలో… దిగ్గజ సంస్థగా ఉన్న ఎల్ అండ్ టీ సంస్థ.. ఆంధ్రప్రదేశ్‌లో.. తమ కాంట్రాక్టులకు ఎదురవుతున్న ఆటంకాలపై.. అసంతృప్తితో ఉంది. ఎలాంటి కారణాలు లేకుండా… మారిన ప్రభుత్వం.. పనులు మొత్తం ఆపేయమని ఆదేశాలు జారీ చేయడంతో.. ఎల్ అండ్ టీ… మొత్తం యంత్ర సామాగ్రిని.. మ్యాన్ పవర్‌ను.. ఇతర కాంట్రాక్ట్ సైట్లకు తరలించేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో.. ఎల్ అండ్ టీ.. దాదాపుగా … రూ. తొమ్మిది వేల కోట్ల విలువైన పనులు చేపడుతోంది. రోడ్లతో పాటు భారీ భవనాలు కూడా ఈ కాంట్రాక్టుల్లో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం రాగానే.. ఇరవై ఐదు శాతం కన్నా తక్కువ పనులు జరిగిన వాటిని ఆపేయమని ఏకపక్షంగా ఆదేశాలు రావడంతో.. ఎల్ అండ్ టీ… మరో మాట మాట్లాడకుండా వెళ్లిపోయింది.
నిజానికి.. అమరావతిలో.. నిర్మాణాలు చేపడుతున్న సంస్థలు ప్రభుత్వం మారగానే… ముఖ్యమంత్రి జగన్ వద్దకు వచ్చి.. చర్చిస్తారని.. వైసీపీ నేతలు అనుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పలుమార్లు.. అమరావతిలో నిర్మాణాలు ఎందుకు నిలిపివేశారో తెలియదని.. కాంట్రాక్టర్లకు ఏమైనా సమస్యలు ఉంటే.. ముఖ్యమంత్రితో చర్చించవచ్చని ప్రకటించారు. కానీ కాంట్రాక్టర్లు.. ప్రభుత్వంతో సంప్రదింపులకు సిద్ధపడలేదు. 25 శాతం కన్నా తక్కువ పనులు జరిగినవాటిని ఆపేయమని ముందుగానే ఆదేశాలివ్వడంతో.. ఆ ప్రకారం.. ఆ కంపెనీలు కూడా.. తాము చేపడుతున్న ఇతర కాంట్రాక్టుల వద్దకు సామాగ్రిని తరలించారు.
ఏపీ ప్రభుత్వ తీరుపై.. ఎల్ అండ్ టీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ సుబ్రహ్మణ్యం.. వ్యక్తం చేస్తున్న అభిప్రాయం… వ్యాపారవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. ఓ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను.. తర్వాత వచ్చిన ప్రభుత్వం ముందూ వెనుక ఆలోచించకుండా… ఆపేయడం.. తాను ఇంత వరకూ చూడలేదని ఆయన అంటున్నారు. ఏపీలో తమ కంపెనీ చేపడుతున్న ప్రాజెక్టులు.. తమకు ఉన్న మొత్తం ఆర్డర్స్‌లో కేవలం మూడు శాతమేనని చెబుతున్నారు. పరిస్థితులు ఇలా ఉంటే.. ఏపీలో ఇక .. ఏ కాంట్రాక్టునూ.. చేయడానికి ఎల్ అండ్ టీ ఆసక్తి చూపించదన్న అభిప్రాయం… మౌలిక వసతుల నిర్మాణ రంగంలో ఉన్న వారికి ఏర్పడుతోంది.