కాపు రిజర్వేషన్లను రద్దు చేయడానికి చంద్రబాబే కారణమని.. జగన్ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 4న కాపు రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలంటూ..కేంద్రం రాసిన లేఖ అంశాన్ని సమావేశంలో ప్రస్తావించారు. గతంలో కాపులను బీసీల్లో చేర్చాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానం.. ఓబీసీలో కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇచ్చిన అంశాల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో కేంద్రం ప్రస్తావించిందన్నారు. కేంద్రం లేఖకు చంద్రబాబు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని గుర్తు చేశారు. అప్పుడు క్లారిటీ ఇచ్చి ఉన్నట్లయితే.. ఇప్పుడు.. కాపు రిజర్వేషన్లు కొనసాగించడానికి ఇబ్బంది ఉండేది కాదన్నట్లు కాపు నేతలు మీడియాకు సమాచారం ఇచ్చారు.
రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశమే లేనప్పుడు.. మళ్లీ కమిటీ వేయడం ఎందుకన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది. ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసేసుకుని.. ఇప్పుడు పార్టీ పరంగా కంటి తుడుపు చర్యగా… కమిటీ వేయడం అంటే… ఏదో విధంగా.. కాపుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చడానికేనన్న చర్చ నడుస్తోంది. ఈ కమిటీ..కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెబుతుందో.. లేక చంద్రబాబు వల్లే ఇవ్వలేకపోతున్నామని చెబుతుందో కానీ.. మొత్తానికి.. జగన్ మాత్రం.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా… ఉందని చెప్పుకోవడానికి కమిటీని మాత్రం ఏర్పాటు చేశారన్న అభిప్రాయం మాత్రం అందరిలోనూ కనిపిస్తోంది.