బీజేపీ నేత కృష్ణంరాజుకు… ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఓపిక లేదు. మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుండి.. తనకు గవర్నర్ పోస్టు వస్తుందని.. చాలా ఆశలు పెట్టుకున్నారు. బాహుబలి రిలీజయిన తర్వాత ప్రభాస్‌ను తీసుకుని మోడీ దగ్గరకు వెళ్లి ఫోటోలు కూడా దిగి వచ్చారు. ఎన్నో సార్లు దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ.. ఒక్క సారి కూడా.. ఆయన పేరును.. మోడీ, అమిత్ షా పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటికిప్పుడు.. కొత్తగా చాలా మంది గవర్నర్లను నియమిస్తున్నారు కానీ.. ఎప్పటికప్పుడు కృష్ణంరాజుకు నిరాశే ఎదురవుతోంది. ఆరెస్సెస్ హార్డ్ కోర్… సీనియర్లను ప్రస్తుతం మోడీ, షా గవర్నర్లుగా నియమిస్తోంది. దాంతో.. కృష్ణంరాజు అవకాశాలు సన్నగిల్లిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది.
అయితే కృ।ష్ణంరాజు మాత్రం.. తన ప్రయత్నాలను సీరియస్‌గానే కొనసాగిస్తున్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే.. మామూలుగా వెళ్లి సభ్యత్వం ఇస్తే.. ఎవరు పట్టించుకుంటారు.. ఏదో ఓ మీడియా అటెన్షన్ పొందాలి కాబట్టి… దానికి చంద్రబాబునే ఉపయోగించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. సహజంగా బీజేపీ నేతలకు చంద్రబాబు అంటే కోపం.. దాన్ని కృష్ణంరాజు మరో రేంజ్‌కు తీసుకెళ్తున్నారు. చంద్రబాబును ఓ రోజు.. చచ్చిన పాము అనేశారు. ఇక ఆ పామును కొట్టాల్సిన పనేముందన్నారు. మరో రోజు.. అబద్దాలు మాట్లాడటం, మోసాలు చేయడంలో..చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారని విమర్శించేశారు. ఇంకా ఘాటు ఘాటు విమర్శల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు.
బీజేపీ కోసం తాను యాక్టివ్‌గా ఉన్నానని చెప్పుకునేందుకు కృష్ణంరాజు ఆరాటమని..ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ పోస్టు పొందడం.. కృష్ణంరాజు.. టార్గెట్. అయితే.. కృష్ణంరాజుపై.. హైకమాండ్‌కు.. సానుకూల దృక్పథం లేదని .. ఏపీ బీజేపీ నేతలే చెబుతున్నారు. గతంలో.. టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు మాత్రమే.. ఆయన ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత… బీజేపీని వదిలి పెట్టి వెళ్లిపోయారు. పీఆర్పీలో చేరారు. మళ్లీ బీజేపీకి కాస్త మంచి రోజులు వచ్యాయని…అనుకున్న తర్వాతనే బీజేపీలో చేరారు. అందుకే.. కృష్ణంరాజుపై.. బీజేపీ హైకమాండ్ కు సానుకూల భావన లేదని.. గవర్నర్ పోస్టు ఇవ్వకపోవచ్చని అంటున్నారు. అయినా కృష్ణంరాజు మాత్రం.. తన వంతు ప్రయత్నాలు.. తనదైన శైలిలో చేసుకుంటున్నారు.