వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత .. ఒక్క శుక్రవారం కూడా కోర్టుకు వెళ్లలేదు. ఎన్నికల్లో గెలుపుతో ముఖ్యమంత్రి పదవితో పాటు ఆయనకు.., ఆయన వెసులుబాటు కూడా దక్కినట్లుగా ఉంది. ఆ తర్వాత నుంచి.. వరుసగా.. ఆయన గుడ్ న్యూస్లే వినిపిస్తున్నాయి. సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా.. ఎన్ఫోర్స్మెంట్ పెట్టిన కేసుల్లో.. ఇప్పటి వరకూ.. కొన్ని వేల వందల కోట్ల ఆస్తులను. ఈడీ అధికారులు ఎటాచ్ చేశారు. ఇటు జగన్ కంపెనీలవి.. అటు.. క్విడ్ ప్రో కో ద్వారా.. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని కేసులు ఎదుర్కొంటున్న వారి ఆస్తులూ.. ఇందులో ఉన్నాయి. ఇప్పటి వరకూ..ఈడీ… ఈ ఆస్తులను ఎటాచ్ చేయడాన్ని గట్టిగా సమర్థించుకుంది. కానీ.. ఇప్పుడు మాత్రం … ఆ మాత్రం సమర్థన చేయలేకపతోంతి. ఫలితంగా.. ఈడీ కేసు నుంచి ఒక్కొక్క ఆస్తి బయట పడుతోంది. జప్తును తొలగిస్తూ.. ఈడీ రోజుకొకటి చొప్పున ఆదేశాలు జారీ చేస్తోంది.
రెండు వారాల క్రితం పెన్నా సిమెంట్స్, పయనీర్ హాలిడే రిసార్ట్స్, ఎంబసీ ప్రాపర్టీ డెవలప్మెంట్ సహా దాని యజమాని జితేంద్ర వీర్వాణిలకు ఈడీ ఉపశమనం కలిగించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతాప్‌రెడ్డికి చెందిన పెన్నా సిమెంట్స్‌కు, పయనీర్ హోటళ్లకు చేకూర్చిన లబ్ధికిగాను అవి క్విడ్ ప్రోకో కింద జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనే అభియోగంతో వాటి ఆస్తులను ఈడీ జప్తుచేసింది. హైదరాబాద్, నంద్యాలల్లో హౌసింగ్ బోర్డుతో కలిసి ఇందూ గ్రూపు చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారంలో ఈడీ జప్తు చేసిన ఆస్తులను వాపసు చేయాలని అప్పిలేట్ అథారిటీ ఆదేశించింది. రెండు రోజుల కిందట.. రాంకీ, జగతి పబ్లికేషన్స్‌కు సంబంధించి జప్తులో ఉన్న డిపాజిట్స్ విడుదల చేయాలని ఈడీకి అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో రాంకీకి షరతులు విధించింది. ఆస్తుల్లో నిర్మాణాలు చేపట్టడం గానీ, ఇతరులకు విక్రయించడం గానీ చేయరాదని ఆదేశించింది. జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్‌ను జఫ్తు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.
అలాగే భారతి సిమెంట్స్ డైరెక్టర్ జెల్లా జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. జెల్లా జగన్మోహన్ రెడ్డికి… వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. ఆయన ద్వారా కడప జిల్లాలో భారతి సిమెంట్స్ సంస్థ 2037 ఎకరాల మైనింగ్ లీజు పొందిందని.. ఇందుకోసం మైనింగ్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిందని ఈడీ పేర్కొంది. ఇందుకు ప్రతిఫలంగానే.. అర్హత లేకపోయినా జెల్లా జగన్ ను భారతి సిమెంట్స్ డైరెక్టర్ గా నియమించిన భారీ వేతనాలు ఇస్తున్నారని ఈడీ ఆరోపించింది. ఆయనకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసింది. దీనిని కూడా.. రిలీజ్ చేయాలని ఆదేశించారు. ఇప్పుడు.. భారతి సిమెంట్స్‌కు సంబంధించి ఈడీ జప్తు చేసిన రూ. 746 కోట్ల రూపాయల ఆస్తులను రిలీజ్ చేయాలని తాజాగా ఆదేశించింది. జగన్, భారతిరెడ్డి సహా.. కంపెలన్నింటికీ ఊరట లభించింది. జప్తులన్నీ వరుసగా… వీడిపోతూండటంతో.. సీబీఐ కేసులు కూడా తేలిపోతాయని… వైసీపీ వర్గాలు సంతోష పడుతున్నాయి.