వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన అక్రమాస్తుల కేసుల్లో… క్విడ్ ప్రో కో కేసుల్లో… జప్తు చేసిన ఆస్తులను.. ఈడీ అప్పిలేట్ ట్రిబ్యునల్ రోజువారీగా… విడుదల చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా.. రోజుకో కేసులో తీర్పు వస్తోంది. ఇంత వేగంగా.. ఇటీవలి కాలంలో.. ఏ ఈడీ కేసులోనూ.. తీర్పులు రావడం లేదు. తాజాగా వాన్‌పిక్ కేసులో వైఎస్ జగన్, నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఈడీ ట్రిబ్యునల్‌లో ఊరట లభించింది. ఈడీ జప్తు చేసిన జగన్, నిమ్మగడ్డ ఆస్తులను.. విడుదల చేయాలని ఈడీ ట్రిబ్యునల్ ఆదేశించింది. జగన్‌కు చెందిన 538 కోట్ల విలువైన ఆస్తులు, ఇడుపులపాయలో 42 ఎకరాలు, పులివెందులలో 16 ఎకరాలు బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ప్లాటు, యంత్రాలను గతంలో… ఈడీ జప్తు చేసింది. ఈ జప్తును రద్దు చేస్తూ.. ఈడీ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. వాన్‌పిక్ భూములు సహా.. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన 325 కోట్ల విలువైన ఆస్తుల జప్తును కూడా ఈడీ ట్రిబ్యునల్ రద్దు చేసింది. 274 కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని నిమ్మగడ్డను ట్రిబ్యునల్ ఆదేశించింది.
రెండు వారాల క్రితం.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితుడైన.. పెన్నా ప్రతాపరెడ్డికి చెందిన ఆస్తుల ఆటాచ్ మెంట్‌ను కూడా.. ఈడీ ట్రిబ్యునల్ తొలగించింది. ఆ తర్వాత భారతి సిమెంట్స్ కు చెందిన జెల్లా జగన్మోహన్ రెడ్డి ఆస్తులను కూడా.. అప్పిలేట్ ట్రిబ్యునల్.. జప్తు నుంచి మినహాయించింది. వెైఎస్ జగన్, భారతి, జగతి ఆస్తులను కూడా ఈడీ జప్తకు నుంచి మినహాయింపు నిచ్చింది. ఇప్పుడు వాన్ పిక్ నుంచి కూడా.. మినహాయింపు లభించింది. మొత్తంగా.. వారం పది రోజుల్లోనే.. గతంలో ఈడీ చేసిన జప్తులన్నీ.. తొలగిస్తూ.. ట్రిబ్యునల్ నిర్ణయాలను ప్రకటిస్తోంది. ఈడీ తీర్పులో వాన్ పిక్ ప్రాజెక్ట్ కొనసాగించుకోవచ్చని కూడా తీర్పు ఇచ్చింది. ఓ వైపు.. ఇదే కేసులో.. సెర్బియాలో… నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయ్యారు. కానీ ఇండియాలో మాత్రం ఆయనకు అనుకూలమైన తీర్పు వచ్చింది.
జగన్‌తో పాటు అక్రమాస్తుల కేసులో ఉన్న వారికి వరుసగా వస్తున్న రిలీఫ్‌లు .. న్యాయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి. మీడియాకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఈడీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో.. ఈడీ ఎలాంటి వాదనలు వినిపిస్తున్నట్లుగా లేదు. జగన్ తోపాటు.. జప్తు చేసిన ఆస్తులకు సంబంధించిన న్యాయవాదులు తమ వాదన వినిపిస్తున్నారు కానీ.. ఈడీ న్యాయవాదులు మాత్రం.. అసలు రాకపోవడమో.. వచ్చినా సైలెంట్‌గా ఉండటమో చేస్తున్నారన్న అభిప్రాయం… న్యాయవర్గాల్లో ఏర్పడింది. లేకపోతే.. గతంలో.. ఏళ్ల తరబడి విచారణ జరిగిన కేసులు… గతంలో.. పక్కాగా సాక్ష్యాలున్నట్లుగా.. అడ్జ్యూడుకేటింగ్ అథారిటీ కూడా.. నిర్ధారించిన జప్తులను అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇంత తేలిగ్గా.. తీసుకోవడం ఉండదని అంటున్నారు. మొత్తానికి.. జగన్ తో పాటు అక్రమాస్తుల కేసు సహనిందితులకు వస్తున్న వరుస ఊరటలు ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.