మాజీ మంత్రి లోకేష్ జగన్ కు ఒక కొత్త పేరు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పై జగన్ వైఖరిని తప్పు పట్టిన కేంద్రమంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ, “తుగ్లక్ గారు ఉన్నారా? విన్నారా?” అంటూ జగన్ మీద సెటైర్లు వేశారు.
లోకేష్ ట్వీట్్ చేస్తూ, “తుగ్లక్ గారు ఉన్నారా? విన్నారా? పోలవరం టెండర్లు రద్దు చెయ్యడం బాధాకరం, మీ తుగ్లక్ చర్య వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ గారు లోక్ సభ లో చెప్పారు. పోలవరం ప్రాజెక్టు లో 2600 కోట్ల అవినీతి జరిగిపోయింది అంటూ తల తిక్క లెక్కలు చెబుతున్న మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ, కేంద్ర జలసంఘం,
కేంద్ర జలవనరులశాఖ, సిడబ్ల్యుసి, కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించిన తర్వాతే నాబార్డ్ నిధులు విడుదల చేస్తుంది. ఇన్ని కేంద్రవ్యవస్థలకు కనిపించని అవినీతి మీకు కనిపించింది. రివర్స్ టెండరింగ్ అంటే ఆంధ్రుల జీవనాడి పోలవరానికి టెండర్ పెట్టడమని అర్థమయింది” అంటూ వ్రాసుకొచ్చారు.
ఒక నాలుగేళ్ల కిందట లోకేష్ ని మొదటి సారి “పప్పు” అంటూ సోషల్ మీడియాలో వై ఎస్ ఆర్ సి పి పార్టీకి సంబంధించిన వారు మొదలు పెట్టినప్పుడు ఆ పదం ఇంతగా పాపులర్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. అయితే లోకేశ్ తెలుగు ఉచ్చారణలో చేసిన పొరపాట్ల కారణంగా ఆ పదం సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఇప్పుడు లోకేష్ జగన్ కు ఇచ్చిన తుగ్లక్ అనే పేరు పాపులర్ అవుతుందా లేదా అన్నది కూడా జగన్ భవిష్యత్తులో తీసుకొనే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. జగన్ గనుక నాలుగైదు తలక్రిందుల నిర్ణయాలు తీసుకున్నట్లయితే, ఈ పేరు జన సామాన్యంలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది.
తుగ్లక్ గారు ఉన్నారా? విన్నారా? పోలవరం టెండర్లు రద్దు చెయ్యడం బాధాకరం, మీ తుగ్లక్ చర్య వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ గారు లోక్ సభ లో చెప్పారు pic.twitter.com/XxNz8OBLin
— Lokesh Nara (@naralokesh) August 2, 2019