భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు.. ఆ పార్టీ నేతలకు కరివేపాకులా మారారు. ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. పార్టీ కార్యక్రమాల గురించి సమాచారం లేదు. ఆయన సొంతగా.. ఏదైనా కార్యక్రమాలు పెట్టుకుంటే.. సరే లేకపోతే.. పార్టీ తరపున అధికారిక కార్యక్రమాలకు ఆయనకు పిలుపు రావడంలేదు. ఆయన పార్టీలోకి తీసుకొచ్చిన అతి కొద్ది మంది నేతలతో కలిసి మాత్రమే.. ప్రస్తుతం కన్నా రాజకీయం చేయగలుగుతున్నారు. మరో బీజేపీ నేత.. ఆయనతో టచ్లోకి వెళ్లడం లేదు. దాంతో.. ఏం జరుగుతుందో.. కన్నాకు కూడా అర్థం కాని పరిస్థితి.
అంతా తానై వ్యవహరిస్తున్న సునీల్ ధియోధర్.. !
ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల కో ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న సునీల్ ధియోధర్.. పార్టీ మొత్తాన్ని టేకోవర్ చేశారు. మొత్తం రోజుారీ కార్యక్రమాలు ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఆయన కూడా.. పార్టీ కార్యాలయానికి పరిమితం అవడమో… లేకపోతే.. నాయకులకు సూచనలు చేసి వదిలేయడమో చేయడం లేదు. ఆ మూల నుంచి.. ఈ మూలకు.. రోజువారీగా… షెడ్యూల్ ఖరారు చేసుకుని తిరుగుతున్నారు. ఎక్కడిక్కడ.. పార్టీని యాక్టివ్గా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్ని రకాల పనులు ఆయనే మీదేసుకుంటున్నారు. హైకమాండ్ వద్ద పలుకుబడి ఉండటంతో.. ఆయనకే బీజేపీ నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారు.
చేరికలపై కనీస సమాచారం కూడా కన్నాకు ఉండట్లేదు..!
భారతీయ జనతా పార్టీలో ఇటీవలి కాలంలో.. టీడీపీ నుంచి కొన్ని చేరికలు జరిగాయి. ఒక్కటంటే.. ఒక్క చేరిక విషయంలో కన్నా లక్ష్మినారాయణకు సమాచారం లేదు. కనీసం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా.. ఆయనకు కొంత సమాచారం ఇవ్వాల్సి ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరైనా పార్టీలో చేరాలనుకుంటే… వారిని తీసుకుని.. వారితో డీల్ సెట్ చేసుకున్న నేత ఢిల్లీకి వెళ్తున్నారు. తమకు తెలిసిన ప్రముఖులతో కండువా కప్పించి తీసుకు వస్తున్నారు. చేరికల విషయంలో బీజేపీ నేతలు.. తమ తమ ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే.. ఆ క్రెడిట్లో ఒక్క శాతం కూడా కన్నాకు ఇవ్వకూడదనుకుంటున్నారు. పోనీ చేరిన తర్వాతైనా.. మర్యాదపూర్వకంగా వారు కన్నాతో భేటీ అవుతున్నారా.. అంటే.. అంటే.. కన్నాను పరిగణనలోకి తీసుకవడం లేదు. బీజేపీలో టీడీపీ ఎంపీలు.. మాజీ ఎమ్మెల్యేలు… కన్నాకు కనీసం ఓ కర్టెసీ కాల్ కూడా చేయలేదు.
బీజేపీని నమ్ముకుని మంత్రి పదవి మిస్సయిన కన్నా..!
కన్నా లక్ష్మినారాయణ సీనియర్ నేత. ఆయనకు సామాజికవర్గం అండ ఉంది. ఇప్పుడు బీజేపీలో పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. ఆయనకు కనీస ప్రాధాన్యత దక్కడం లేదు. రేపో మాపో.. ఆయనను ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో… ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు తల్చుకున్న కన్నా అనుచరులు.. ఆవేదనకు గురవుతున్నాయి. ఆయన వైసీపీలో చేరడానికి రెడీ అయిపోయారు. బయలుదేరారు కూడా. కానీ.. అమిత్ షా చెప్పడంతో.. బీపీ తెచ్చుకుని.. ఆగిపోయారు. ఫలితంగా.. ఏపీ బీజేపీ అధ్యక్ష పీఠం వచ్చింది ., కేంద్రంలో బీజేపీ వస్తే.. కేంద్రమంత్రి పదవి వస్తుందని.. కన్నా ఆశించారు. కేంద్రంలో బీజేపీ వచ్చింది కానీ… ఆయనకు కేంద్రమంత్రి పదవి కాదు.. కదా.. కనీస పదవి కూడా వచ్చే చాన్సులు లేవు. అదే ఆ రోజు ఆగిపోకుండా వైసీపీలో చేరిపోయినట్లయితే.. సీనియర్ గా మాత్రమే కాదు.. సామాజికవర్గ కోటాలోనూ.. ఆయనకు మంత్రి పదవి ఖాయంగా వచ్చి ఉండేదంటున్నారు. మొత్తానికి కన్నాకు ఏదీ కలసి రావడం లేదు.