వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి ఓ ప్రత్యేకమైన కార్యాచరణ సిద్ధం చేసింది. వైసీపీ వ్యవహారాలను… ఒంటి చేత్తో నడుపుతున్న విజయసాయిరెడ్డి… ఇందు కోసం.. ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. అదేమింటటే… ఒక్కో జిల్లాకు ఒక్కో కౌంటర్ ఏర్పాటు చేయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం.. తాడేపల్లిలో.. అత్యాధునిక అద్దాల భవంతిని అద్దెకు తీసుకున్నారు. ఆ కార్యాలయంలో.. ఇప్పుడు ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలలోనే… అది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వైసీపీ సోషల్ మీడియా సహా.. అన్ని విభాగాలు అక్కడ్నుంచి పని చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కార్యకర్తల సంక్షేమాన్ని కూడా అక్కడ్నుంచే చూసుకోబోతున్నారు. అలా చూసుకోవడానికే.. ఈ పదమూడు కౌంటర్ల కాన్సెప్ట్‌ను.. విజయసాయిరెడ్డి ఆలోచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పదమూడు జిల్లాలు ఉన్నాయి. ఈ పదమూడు జిల్లాలకు .. పదమూడు కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో జిల్లా వ్యవహారాలు.. ఒక్కో కౌంటర్లో చూస్తారు. ఆ జిల్లాకు చెందిన వారందరూ.. ఆ కౌంటర్లో తమకు సంబంధించిన వ్యవహారాలను చక్క బెట్టుకోవచ్చు. కావాల్సిన సాయాన్ని పొందొచ్చు. అతి త్వరలోనే అంటే.. బహుశా.. కార్యాలయం ప్రారంభం నుంచే.. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని.. విజయసాయిరెడ్డి చెప్పుకొస్తున్నారు. అన్ని పార్టీలు.. కార్యకర్తలే తమకు ఆస్తి అని చెబుతూంటాయి కానీ.. వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఓపెన్ చేయాలనే ఆలోచన మాత్రం చేయలేదు. ఆడిటర్‌గా విశేషానుభవం పొందిన విజయసాయిరెడ్డికి మాత్రం.. వినూత్నంగా కౌంటర్ ఆలోచన వచ్చింది.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా… క్విడ్ ప్రో కో కింద వసూళ్లకు.. జగన్మోహన్ రెడ్డి కౌంటర్లు ఓపెన్ చేశారని.. ఆ పనులను.. విజయసాయిరెడ్డే చూసుకున్నారని.. టీడీపీ నేతలు విమర్శలు చేసేవారు. అయితే..టీడీపీ నేతలు అక్కడ కౌంటర్లు అన్న పదాన్ని సాధారణంగా వాడారు. నిజంగానే కౌంటర్లు ఓపెన్ చేశారని కాదు.. కానీ విజయసాయిరెడ్డి.. మాత్రం.. ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే కౌంటర్లు ఓపెన్ చేస్తున్నారు. కానీ.. కలెక్షన్ల కోసం.. కాదు.. కార్యకర్తల సంక్షేమం కోసం. ఎంతైనా… ఇది వింతైన ఆలోచనే..!