పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లను తూ.చ తప్పకుండా పాటించాల్సిందేనని… ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ఉద్దేశపూర్వకంగా.. తమ వద్ద విద్యుత్ కొనుగోలు చేయడం లేదని.. ఏపీ సర్కార్ తో ఒప్పందం కుదుర్చుకున్న విద్యుత్ సంస్థలు.. హైకోర్టులో పిటిషన్లు వేశాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు… పీపీఏల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ.. విద్యుత్ కొనుగోలు చేయాల్సిందేనని.. ఏపీ ట్రాన్స్‌కోతో పాటు.. లోడ్ డిస్పాచ్ సెంటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ కొనుగోలు చేయకపోతే.. ఎందుకు కొనుగోలు చేయడం లేదో.. లిఖితపూర్వకంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిచింది.
ఒప్పందం ప్రకారం.. విద్యుత్ కొనుగోలు చేయకపోవడం… ఇండియన్ విద్యుత్ గ్రిడ్ కోడ్ నిబంధనలకు విరుద్ధమని.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరో వైపు.. కేంద్రం కూడా.. ఈ మేరకు.. ఏపీ సర్కార్‌కు మరో లేఖ రాసింది. సహేతుక కారణాలు లేకుండా.. విద్యుత్ కొనుగోలు చేయడం నిలిపివేసినా.. డబ్బులు ప్రభుత్వం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. గతంలో కేంద్రం నుంచి.. ఏపీ సర్కార్ కు.. రెండు లేఖలు వచ్చాయి. ఇప్పుడు.. కొనుగోళ్ల విషయంలో… కూడా.. మరో లేఖ వచ్చింది. మొత్తంగా.. పీపీఏల విషయంలో మూడు లేఖలు… కేంద్రం నుంచి ఏపీకి వచ్చాయి. కానీ ఏపీ సర్కార్ దేన్నీ లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు హైకోర్టు కూడా.. కొనుగోళ్లు ఒప్పందం ప్రకారం చేసి తీరాల్సిందేనని హెచ్చరికలు జారీ చేయడంతో.. పరిస్థితి మారిపోయింది.
ఈ వివాదం నుంచి ఎలా బయటపడాలా.. అని .. సీనియర్ అధికారులు… తర్జన భర్జన పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇంతటితో.. దీన్ని వదిలేయాలని… చూసీచూడనట్లుగా ఉంటేనే బెటరని.. తెగేదాకా లాగితే… మొత్తానికే మోసం వస్తుందన్న అభిప్రాయాన్ని ఏపీ ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నది చేయాలనుకుంటారు.. మరి పీపీఏలో విషయంలో ఇంతటితో ఆపేస్తారా..? లేక మరిన్ని అడుగులు ముందుకేస్తారా అన్నది ఆసక్తికరం.