`సోగ్గాడే చిన్ని నాయిన`ని రీమేక్ చేయాలని నాగార్జున ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. బంగార్రాజు పాత్రని ఫుల్ లెంగ్త్‌లో చూపిస్తే.. వర్కవుట్ అవుతుందని ఆయన ప్లాన్. దర్శకుడు కల్యాణ్ కృష్ణ కూడా మూడేళ్ల నుంచీ ఈ ప్రాజెక్టుపైనే పని చేస్తున్నాడు. కానీ ఎప్పుడూ ఏదో ఓ అవాంతరం. బంగార్రాజు స్క్రిప్టు ని నాగ్‌తో ఒప్పించడానికి కల్యాణ్ చాలా కష్టపడ్డాడు. చాలా వర్షన్లు రాశాడు. చివరికి నాగ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ సినిమాలో చైతూకీ ఓ పాత్ర క్రియేట్ చేసి, మల్టీస్టారర్ లా మార్చాడు. మన్మథుడు 2 పూర్తయిన వెంటనే బంగార్రాజు ప్రారంభం అవుతుందనుకున్నారు. కానీ.. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు మళ్లీ బ్రేకులు పడ్డాయి.
కల్యాణ్ కృష్ణ సోదరుడు ఇటీవలే మరణించారు. దాంతో కల్యాణ్ తన సొంతూరు వెళ్లిపోయారు. ఆయన తిరిగి రావడానికి, మళ్లీ పనులు మొదలెట్టడానికి సమయం పడుతుంది. మరోవైపు… ఈ కథలో మార్పులు, చేర్పులు అవసరమని నాగ్ భావిస్తున్నారు. అవన్నీ పూర్తయి, నాగ్ ఈ స్ర్కిప్టుకి పచ్చజెండా ఊపడానికి ఇంకాస్త సమయం పడుతుందేమో అనిపిస్తోంది. ఈలోగా నాగ్ దగ్గరకు కొత్త కథలేమైనా వస్తే మాత్రం బంగార్రాజు మళ్లీ అటెకెక్కేసినట్టే.