కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ సంక్షేమ వసతి గృహంలో మూడో తరగతి విద్యార్థి ఆదిత్య హత్య కేసు మిస్టరీ వీడింది. ఎనిమిదేళ్ల బాలుడ్ని పదో తరగతి విద్యార్థి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తిట్టాడన్న కోపం, ఘర్షణ పడ్డాడన్న పగతో రగిలిపోయిన పదో తరగతి విద్యార్థి…. అత్యంత పాశవికంగా ఆదిత్య గొంతు, మెడ కోసి చంపాడు. 15 ఏళ్లు కూడా లేని ఓ విద్యార్థి ఇంత కర్కశంగా ప్రవర్తించాడని తెలుసుకుని అంతా ఉలిక్కిపడుతున్నారు.
ప్రొఫెషనల్ కిల్లర్ స్టైల్లో ప్లాన్డ్గా మర్డర్..!
సోమవారం రాత్రి హాస్టల్లోని బాత్రూమ్లో హత్యకు గురయ్యాడు ఆదిత్య. కృష్ణా జిల్లా చల్లపల్లిలోని నారాయణరావునగర్‌కు చెందిన గిరిజన విద్యార్థి ఆదిత్య హత్యపై భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మెడ, గొంతుపై లోతైన గాయం ఉండడంతో కిరాతకంగా హత్యచేసినట్లు నిర్ణయించారు. ఎవరు చంపారో.. పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. చివరికి కుటుంబగొడవలు ఉన్నాయేమోనని.. ఆ దిశగా ఆలోచించారు. హత్యకు గురైన బాలుడి తల్లిదండ్రులకు సమీప బంధువులతో వివాదాలుండటంతో.. ఆ కోణంలోనూ దర్యాప్తు చేశారు. అయితే.. ఆదిత్య బాత్రూమ్కు వెళ్లేటప్పుడు.. అతని వెంట పదో తరగతి విద్యార్థి ఉన్నాడని తోటి విద్యార్థులు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయట పడింది.
మాట వినడం లేదని ప్లాన్ వేసి ప్రాణం తీశాడు…!
అనుమానిత విద్యార్థిని ప్రశ్నిస్తే తనను అసలు విషయం చెప్పారు. ఆదిత్య తన మాట వినడం లేదని… దుర్భాషలాడాడని అందుకే చంపేశానని ఒప్పుకున్నాడు. పెన్సిళ్లు చెక్కే బ్లేడ్ స్వాధీనం చేసుకున్నారు. ఆదిత్యను హత్య చేసిన సమయంలో రక్తం మరకలు దుస్తులపై పడడంతో… వాటిని తన సూట్‌కేసులో దాచాడు పదో తరగతి విద్యార్థి. ఆ తర్వాత వేరే దుస్తులు ధరించి ఏమీ ఎరగనట్లు వెళ్లి నిద్రపోయాడు.
పసి మనసుల్లో “మర్డర్ ప్లాన్లు” ఎవరి పాపం..!?
ఇంకా జీవితం అంటే ఏమిటో తెలియదు.. లోకం గురించి తెలుసుకునే ప్రయత్నాల్లో అడుగులు వేయనే లేదు. కానీ.. అప్పటికే ఆ పదో తరగతి విద్యార్థి… హత్య చేశాడు. ఓ ప్రొఫెషనల్ కిల్లర్‌గా.. హత్య చేసి.. .తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. దొరికిపోయాడు. అతని మనసులో… చంపాలనే ఆలోచన ఎలా వచ్చందో పోలీసులకూ అంతు చిక్కకుండా ఉంది. అతని తండ్రికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. తండ్రిని చూసి నేర్చుకున్నారని కొందరు.. సినిమాలు, సీరియళ్లు చూసి .. అలా తయారయ్యాడని మరికొందరు వాదిస్తున్నారు. ఏదైనా… పసి మనసుల్లో విషయం నిండుతుందనేది.. ఈ ఘటన నిరూపించిన సాక్ష్యం..!