చుడా (చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ) చైర్మన్ గా కట్టమంచి పురుషోత్తం రెడ్డి ని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, జగన్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులను 99% కట్టబెడుతున్నారనే విమర్శలకు మరింత బలం చేకూరింది.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చిత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా నియమింపబడిన పురుషోత్తం రెడ్డి ఆ తర్వాత వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ తరఫున ఆ తర్వాత చిత్తూరు మున్సిపల్ కార్పొరేటర్ గా ఆయన ఎన్నికైనారు. అయితే ఇప్పటివరకు పదవులన్నింటినీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైనట్లు కనిపిస్తోంది
ఇప్పటికే నియమించిన కొన్ని పదవుల వివరాలు:
ఏపీఐఐసీ చైర్మన్: రోజా రెడ్డి
సీఆర్డిఎ చైర్మన్: ఆళ్ల రామకృష్ణారెడ్డి
తుడా చైర్మన్: చెవిరెడ్డి భాస్కరరెడ్డి
టీటీడీ చైర్మన్: వైవీ సుబ్బారెడ్డి
ప్రభుత్వ సలహాదారుడు: సజ్జల రామకృష్ణారెడ్డి
వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్: ఎంవీఎస్ నాగిరెడ్డి
వైద్య ఆరోగ్య శాఖ సంస్కరణల కమిటీ: భూమి రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
పార్లమెంటరీ పార్టీ నేత: విజయసాయి రెడ్డి
లోక్‌సభ ప్యానల్ స్పీకర్: పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
లోక్ సభ లో పార్టీ నేత: మిథున్ రెడ్డి
భవిష్యత్తులో జరిగే నియామకాలలోనైనా మళ్ళీ మళ్ళీ ఈ విధంగా ఒకే సామాజిక వర్గానికి పదవులు అప్పగించే వైఖరికి జగన్ స్వస్తి పలుకుతారా అన్నది వేచి చూడాలి.