నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈ సారి తెలుగు సినిమా కు మంచి గుర్తింపు లభించింది. మహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తీసిన మహానటి సినిమాలో నటించిన కీర్తి సురేష్.. ఉత్తమనటిగా..జాతీయ పురస్కారానికి ఎంపికయింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కూడా మహానటి అవార్డు గెలుచుకుంది. బెస్ట్ కాస్ట్యూమ్స్ కేటగిరిలో మహానటి కే పురస్కారం లభించింది. బెస్ట్ సౌండ్ మిక్సింగ్ రంగస్థలం సినిమాకు పని చేసిన రాజాకృష్ణన్ కు దక్కింది. అలాగే.. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ తెలుగు సినిమాగా ‘అ!’ ఎంపికయింది. బెస్ట్ మేకప్ అవార్డు కూడా అ! సినిమాకే దక్కింది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే చి.ల.సౌ సినిమాకు రాహుల్ రవీంద్రన్ కు దక్కింది. ఉత్తమ హిందీ చిత్రంగా అంధాధున్ .. ఆ సినిమాలో నటించిన ఆయుష్మాన్ ఖురానా ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు.
ఉత్తమ హిందీ చిత్రం అంధాధున్
ఉత్తమ నటుడు-ఆయుష్మాన్ ఖురానా(అంధాధున్)
ఉత్తమ సినిమాటోగ్రఫి ( పద్మావత్ )
ఉత్తమ సంగీత దర్శకుడు-సంజయ్ లీలా భన్సాలీ
ఉత్తమ గాయకుడు- అర్జిత్ సింగ్ (పద్మావత్)
బెస్ట్ కొరియోగ్రఫీ-పద్మావత్(ఘూమర్ సాంగ్)
ఉత్తమ యాక్షన్ ఫిల్మ్- ( కేజీఎఫ్ )
ఉత్తమ నటుడు- విక్కీ కౌశల్(ఉరీ)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు – సుధాకర్‌రెడ్డి ఎక్కంటి(నాగ్-మరాఠీ)
తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట
ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా మహానటి
బెస్ట్ కాస్ట్యూమ్స్ మహానటి
ఉత్తమనటి- కీర్తి సురేష్ (మహానటి)
బెస్ట్ సౌండ్ మిక్సింగ్ రాజాకృష్ణన్ (రంగస్థలం)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ తెలుగు సినిమాగా ‘అ!’
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే రాహుల్ రవీంద్రన్, చి.ల.సౌ
బెస్ట్ మేకప్- అ!
బెస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్- ఉత్తరాఖండ్
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్- బ్లేజ్ జాని (కేరళ), అనంత్ బిజాయ్ (హిందీ)
స్పెషల్ జ్యూరీ అవార్డులు:
శ్రుతి హరిహరన్, చంద్రచూడ్ రాయ్, జోజల్ జార్జ్, సావిత్రి
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్- కేజీఎఫ్
సర్జికల్ స్ట్రైక్ చిత్రానికి బెస్ట్ బ్యాక్రౌండ్ మ్యూజిక్ అవార్డు