తెలుగు రాష్ట్రాల మీడియా రంగంలో.. ఓ సంచలనాత్మకమైన డీల్.. చాలా కామ్‌గా జరిగిపోయిందన్న ప్రచారం గుప్పుమంటోంది. ఇప్పటికే టీవీ చానళ్లలో టేకోవర్లు, మూసివేతలతో.. హడావుడి జరుగుతోంది. ఈ సమయంలో.. ఓ పత్రిక కూడా.. పాక్షికంగా.. తన వాటాలను అమ్మేసుకుందని చెబుతున్నారు. టాప్ త్రీ లో ఉండే.. పత్రిక ఒకటి.. తన తెలంగాణ ఎడిషన్ మొత్తాన్ని .. ఇటీవలి కాలంలో మీడియాపై దృష్టి పెట్టి.. టెకోవర్లతో కలకలం రేపుతున్న వ్యాపార ప్రముఖులకే అమ్మేసినట్లుగా చెబుతున్నారు. ఈ డీల్ విలువ రూ. ఐదు వందల కోట్ల నుంచి రూ. ఏడు వందల కోట్ల వరకూ ఉంటుందని అంటున్నారు.
తెలుగు దినపత్రికల్లో ఆ పత్రికది.. ఓ భిన్నమైన నేపధ్యం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. తనదైన శైలి వార్తలతో.. పాఠకులను ఆకట్టుకుటుంది. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా… వ్యతిరేక వార్తలు రాయడంతో.. తనకు తనే సాటి అనిపించింది. ఓ పార్టీకి మద్దతుగా ఉంటుందనే ముద్ర ఉన్నప్పటికీ… ఐడెంటిటీని నిలబెట్టుకోవడంలో… ఆ పత్రికది ప్రత్యేక శైలి. ఫీనిక్స్ పక్షిలా ఎదిగిన ఆ పత్రిక .. తెలంగాణ ఎడిషన్‌ను.. వాటాల విక్రయం పేరుతో అమ్మేసినట్లుగా .. చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ మీడియా రంగంలో గుసగుసలు మాత్రం.. జోరుగానే వినిపిస్తున్నాయి.
తెలుగు పత్రికే అయినప్పటికీ… రెండు రాష్ట్రాల్లో ఒకే విధంగా పత్రికను నడపడం అసాధ్యమన్న అంచనాకు ఆ పత్రిక అంచనాకు వచ్చిందని అంటున్నారు. ఆ ప్రాంతంలో మారిపోయిన రాజకీయ పరిస్థితులు… ఇతర కారణాల వల్ల సర్క్యూలేషన్ లో కూడా.. పెద్దగా పెరుగుదల ఉండటం లేదు. పైగా.. పోటీ కూడా.. ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. కొత్త కొత్త పత్రికలు ..వచ్చాయి. అదే సమయంలో.. భవిష్యత్ వ్యూహాల ప్రకారం చూసినా… పత్రిక నిర్వహణ ఇబ్బందికరం కాబట్టి… తెలంగాణ ఎడిషన్ వరకూ అమ్మేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇది ఎంత వరకు నిజం..? ఎవరు కొన్నారు..? డీల్ ఎంత..? అనేది మాత్రం… బయటకు రావడానికి కొంత సమయం పట్టొచ్చు.