రొటీన్, రొడ్డకొట్టుడు పాత్రల నుంచి మన హీరోలు బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. మేకోవర్లపై మోజు పెంచుకుంటున్నారు. గెటప్ మారిస్తే మేకొవర్ అయిపోదని, సెటప్ మొత్తం మార్చాలని కూడా అర్థం చేసుకున్నారు. వరుణ్‌తేజ్ చేస్తున్న ‘వాల్మీకి’ అందుకు అతి పెద్ద ఉదాహరణ. తమిళంలో ఘన విజయం సాధించిన జిగడ్తాండకు ఇది రీమేక్. అక్కడ బాబీ సింహా పోషించిన నెగిటవ్ రోల్‌ని ఇక్కడ వరుణ్ తేజ్ పోషిస్తున్నాడు. ఇది వరకే వరుణ్ గెటప్ ఎలా ఉండబోతోందన్నది అర్థమైపోయింది. ఈరోజు విడుదల చేసిన టీజర్‌తో అది మరింత ఎలివేట్ అయ్యింది. వరుణ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, లుక్స్ ఇవన్నీ పూర్తిగా మారిపోయిన సినిమా ఇది. టీజర్ మొత్తం ఎనర్జిటిక్‌గా కనిపించాడు. కొన్ని చోట్ల భయపెట్టాడు. క్లైమాక్స్ షాట్ లో అయితే… పూర్తి నట విశ్వరూపానికి ఓ మచ్చుక చూపించాడు. ‘అందుకే పెద్దోళ్లు సెప్పారు. నాలుగు బులెట్లు సంపాదిస్తే అందులో రెండు కాల్చుకోవాల, రెండు దాచుకోవాల అని’ అంటూ హరీష్ శంకర్ మార్క్ సింగిల్ లైనర్‌ని పేల్చాడు. వరుణ్ యాక్షన్‌కీ, హరీష్ డైరక్షన్కీ మిక్కీ జే మేయర్ ఇచ్చిన ఆర్.ఆర్. బాగా హెల్ప్ అయ్యింది. కచ్చితంగా… ‘వాల్మీకి’ మాస్ మన్ననలు పొందుతాడేమో అనిపిస్తోంది. టీజర్‌తో అదరొట్టిన వరుణ్… ఆ ప్రతాపం వెండి తెరపై చూపించగలిగితే – సినిమా హిట్టే.