భారతీయ జనతా పార్టీ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఓ వైపు అధికారికంగా డేరింగ్.. డాషింగ్ నిర్ణయాలు తీసుకుంటూ… మరో వైపు రాజకీయంగా వాటిని ప్లస్ పాయింట్లుగా మార్చుకుంటోంది. ఉనికి లేని చోట.. బలంగా జెండా పాతుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కింతో..దాదాపుగా ఆపరేషన్ పూర్తయింది. భారతీయ జనతా పార్టీ 2014లో అధికారం చేపట్టిన కొత్తలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉనికి ఉండేది కాదు. ఇప్పుడు.. సిక్కిం మినహా అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు సిక్కింలో కూడా ప్రతిపక్షం. రెండు, మూడు నెలల్లో సిక్కింలో.. మరో విలీనాన్ని పూర్తి చేసి అధికారపక్షం అయినా ఆశ్చర్యం లేదంటున్నారు.
సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాన్నే బీజేపీ.. విలీనం లాంటి పెద్ద కర్రతో టార్గెట్ చేసింది.మరి… ఇప్పటి దాకా అడుగు పెట్టలేకపోయిన రాష్ట్రాల్లో ఇంకెంత స్కెచ్ వేయాలి. బీజేపీకి.. కొరకరాని కొయ్యలుగా మిగిలింది…తెలుగు రాష్ట్రాలే. కేరళ, తమిళనాడులతో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు భిన్నం. విలీనాలకు ఎంతో అనువైన వాతావరణం కూడా వారికి ఉంది. అందుకే.. బీజేపీ నేతలు.. తెలుగు రాష్ట్రాల విషయంలో ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. భారతీయ జనతా పార్టీ విలీనాల విభాగానికి హెడ్‌గా వ్యవహరిస్తున్న రామ్ మాధవ్.. ఆంధ్రప్రదేశ్ కు చెందిననేత. ఆయన తన ప్రావీణ్యాన్ని ఏపీలో చూపించేందుకు చాలా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇందులో కొంత మేర సక్సెస్ అయ్యారు.
ఏపీలో ప్రతిపక్ష హోదాను.. విలీనం ద్వారా.. పొందాలన్న ఆయన ప్రయత్నం ఇంకా సక్సెస్ కాలేదు. కొన్నాళ్ల కిందట వరకూ.. టీడీపీ ఎమ్మెల్యేలపై గురి పెట్టారని… ప్రచారం జరిగింది. ఏపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సునీల్ ధియోధర్ లాంటి నేతలు… తామే ప్రతిపక్షం అని ప్రకటించుకోవడం వెనుక కాన్ఫిడెన్స్ అదే అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే సిక్కింలో ఆపరేషన్ ముగిసినందున.. ఇక నెక్ట్స్ టార్గెట్ ఏపీనే అని ప్రచారం జరగడంలో ఆశ్చర్యం లేదనే వాదన రాజకీయవర్గాల్లో ఉంది. మరి కార్యాచరణ ఎలా ఉంటుందో..?