కేఫ్ కాఫీ డే యజమాని సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత.. టాక్స్ టెర్రరిజం అనే పదం వాడుకలోకి వచ్చింది. కార్పొరేట్ వర్గాల్లో ఇప్పుడు ఇదో సంచలనం. దీనికి పోటీగా.. జగన్మోహన్ రెడ్డి..మరో రకమైన టెర్రరిజాన్ని ప్రొత్సహిస్తున్నారని.. సుప్రసిద్ద పారిశ్రామికవేత్తల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి విధానాలను.. బిజినెస్ టెర్రరిజంగా అభివర్ణిస్తూ.. సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త మోహన్ దాస్ పాయ్ ట్వీట్ చేశారు. దాన్ని నేరుగా… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే ట్యాగ్ చేశారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతోందని మోహన్ దాస్ పాయ్ ట్వీట్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. పీపీఏల సమీక్షపై… అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. జపాన్ లేఖ రాసిన నేపధ్యంలో.. బిజినెస్ డైలీ లైవ్ మింట్ లో వచ్చిన వార్తను కోట్ చేస్తూ… తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
జపాన్ కంపెనీలు లేఖ రాసిన తర్వాత అయినా కళ్లు తెరుచుకోవద్దా అని ప్రశ్నించారు. ఇలా చేస్తే ఏపీకి పరిశ్రమలు ఎలా వస్తాయని మోహన్‌దాస్ పాయ్ ప్రశ్నించారు. పరిశ్రమల రంగాన్ని దెబ్బతీసి.. ఆంధ్రప్రదేశ్‌ను కుప్పకూల్చేలా జగన్ వ్యవహరిస్తున్నారని… పాయ్ విమర్శించారు. ఏపీ భవిష్యత్‌ను జగన్ నాశనం చేస్తున్నారని సూటిగానే మండిపడ్డారు. ట్వీట్‌ను నేరుగా జగన్‌కే ట్యాగ్ చేశారు. మోహన్ దాస్ పాయ్ కర్ణాటకకు చెందిన సుప్రసిద్ద పారిశ్రామికవేత్త. ఆయన ఇన్ఫోసిస్ సహా.. అనేక ప్రసిద్ధ కంపెనీల విజయయాత్రలో భాగమయ్యారు. ఆర్యన్ క్యాపిటల్ సంస్థను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం.. మణిపాల్ సంస్థలనూ చూసుకుంటున్నారు.
ఆర్థిక వ్యవహారాల్లో నిపుణుడిగా.. బిజినెస్ వరల్డ్ లో ఆయనకు గుర్తింపు ఉంది. పేదల కడుపు నింపుతున్న అక్షయపాత్ర సహవ్యవస్థాపకుడు కూడా మోహన్ దాస్ పాయ్నే. ఇప్పటికీ కర్ణాటకలోని పలు కంపెనీల్లో మోహన్‌దాస్ పాయ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయనను తమ బోర్డుల్లోకి తీసుకునేందుకు కంపెనీలు పోటీ పడుతూ ఉంటాయి.
Japan issues missive to Andhra Pradesh over reworking of clean-energy PPAs: Report
@ysjagan has destroyed the trust of overseas investors in AP! Singapore has invested hugely in Amravati but AP reneging on contract!will anyone invest again? https://t.co/P34JjHbKhW
— Mohandas Pai (@TVMohandasPai) August 15, 2019
Japan issues missive to Andhra Pradesh over reworking of clean-energy PPAs: Report
@ysjagan is destroying the future of AP by this govt terrorism!Will anybody invest in AP where Govt reneges on contracts,terrorise business?@thesuniljain https://t.co/P34JjHbKhW— Mohandas Pai (@TVMohandasPai) August 15, 2019